‘సేల్ ఆంధ్ర’ : స్కూళ్ల, కాలేజీల,యూనివర్శిటీల భూములు అమ్మరట

ముఖ్యంత్రి జగన్మోహన్ రెడ్డి బిల్డ్ ఆంధ్ర (Build Andhra) పేరుతో సేల్ ఆంధ్ర (Sale Andhra) ఆంధ్రపథకం అమలుచేస్తున్నారని,ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల భూములను కూడా అమ్మేందు ప్రయత్నిస్తున్నారని విమర్శ వచ్చింది.సిపిఐ కార్యదర్శి రామకృష్ణ జగన్ బిల్డ్ ఆంధ్ర ను సేల్ ఆంధ్ర అని వర్ణించారు.
ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఒక క్లారిఫికేషన్ పంపించింది. విద్యాసంస్థల భూములను అమ్మకాలనుంచి మినహాయించాలని. ఎందుకంటే విద్యాసంస్థలకున్నభూముల ఆటస్థలాలకో లేదా భవిష్యత్తులో సంస్థల విస్తరణకోకేటాయించినవి. అవన్నీఖాళీగానే ఉంటాయి. అవి ఎపుడో గాని ఉపయోగపడవు.  నిధుల కొరత ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం నిధుల సమీకరణకు రాష్ట్ర వ్యాపితంగా ప్రభుత్వ కార్యాలకు, గెస్ హౌసుకు , ఇతరాలకు ఉన్న భూములను అమ్మేయాలనుకుంటున్నది.   ఈజాబితాలోకి విద్యాసంస్థలు కూడా వచ్చాయి.  దీనిమీద బాగా వ్యతిరేకత వచ్చింది. భవిష్యత్తు అవసరాలకోసం విద్యాసంస్థల దగ్గిర ఉన్న భూములను ఎలా విక్రమిస్తారని ప్రతిపక్ష పార్టీలతో సహా కొంత మంది విద్యావంతులు కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీనితో రాష్ట్ర ప్రభుత్వ. సేల్ అంధ్రా నుంచి విద్యాసంస్థలను తొలగించింది. ఈ మేరకు జిల్లా అధికారులకు ఆదేాశాలు వెళ్లాయి.
బిల్ద్ ఆంధ్ర పథకం కింద విక్రయించాల్సిన భూములలో  విద్యాసంస్థల భూములను కూడ చేర్చినట్లు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. అందువల్ల బిల్డ్ ఆంధ్ర పథకం పరిధిలోనుంచి స్కూళ్లు,కాలేజీలు, విశ్వవిద్యాలయాలకు మినహయింపు ఇచ్చారు.  కాబట్టి ఎక్కడయినా మాస్టర్ ప్లాన్ లో చేర్చిన  విద్యాసంస్థల భూములను అమ్మాల్సిన భూముల జాబితాలో చేర్చి వుంటే తొలగించాలని ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది.