బస్సులు, రైళ్లు నడుపుతూ హోటళ్లు తెరవకపోతే, తిండి ఎలా?

కర్నూలు జిల్లాలో హోటళ్ళు,లాడ్జింగ్లు‌‌,బేకరీలు,స్వీట్ స్టాల్స్,ఐస్క్రీం పార్లర్లు మొదలగునవిరవాణా సౌకర్యాల లాగానే  కరోనా  లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలల పైగా మూసేయాల్సి వచ్చింది.
ఇపుడు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బస్సు, ప్రైవేటు వాహనాలు‌‌, రైలు మరియు విమాన ఇతర సర్వీసులకు నడిపేందుకు అనుమతులిచ్చారు. ఈ ఇలాగే  హోటళ్ళు , లాడ్జింగ్ లకు కూడా తెరచుకొనే అవకాశం ఇవ్వాలని ర్నూలు నగర మరియు కర్నూలు జిల్లా హోటల్స్ అసోసియేషన్ కోరుతున్నది.
కొన్ని ప్రాంతాల్లో టేక్ అవే పార్సిల్స్ కు అనుమతులు ఇచ్చినప్పటికీ పెద్దగా గిరాకీ లేదు. పార్సిల్స్ తీసుకుని మేము ఎక్కడకు తీసుకుని పోయి తినాలని ప్రశ్నిస్తున్నారు.
అలాగే ఇతర ప్రాంతాలనుంచి జిల్లాకు పనిమీద వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతినిచ్చినపుడు వారు  తినడానికి, బసచేయడానికి తగిన సౌకర్యాలు లేకపోతే ప్రయణాలు ఎలా చేస్తారు?
ఈ కారణంగా పనులు , ప్రయాణాలు వాయిదా వేసుకొంటున్నారు.దీనివల్ల అన్నివిధాలా ఆర్థిక కార్యకలాపాలు మందగించి, ప్రభుత్వం తో సహా అన్నివిధాలా వారికి తీవ్రనష్టాన్ని కొనితెస్తున్నాయి.
ఇప్పటికే రెండు నెలల పైగా ఆతిథ్య రంగం మూసియుంచడం వలన జీతాలు, బాడుగలు,కరెంట్ బిల్లులు, బాంకు అప్పులు, ప్రైవేటు అప్పులు, వడ్డీలు తదితర బకాయిలు ఎక్కువై తీవ్ర నష్టాలపాలైన ఆతిథ్థ్యరంగం చిక్కి శల్యమై
ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ లలో కూడా మా హోటళ్ళ పరిశ్రమకు,ముఖ్యంగా మద్యతరహా మరియు చిన్న చిన్న హోటళ్ళకు ఎటువంటి ఉపయోగం లేదు. కావున ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి, సర్వీస్ వెసలుబాటుతో సహా హోటళ్ళకు,లాడ్జింగ్ లకు, స్వీట్ స్టాల్స్, బేకరీ తదితర వాటికి జిల్లా మరియు రాష్టమంతటా అనుమతులు ఇవ్వాలని ర్నూలు నగర మరియు కర్నూలు జిల్లా హోటల్స్ అసోసియేషన్   బాధ్యులుతా  కోరుతున్నాం.
ప్రభుత్వ మార్గదర్శకాల మేర కోవిడ్19 నివారణ చర్యల్లో భాగంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని వ్యాపారాలను నడుపుకొంటామని  తెలియచేస్తున్నాం.
– కర్నూలు హోటల్స్ అసోసియేషన్:
గౌరవ సలహాదారు:చంద్రశేఖర కల్కూర
రాష్ట్ర ఉపాధ్యక్షుడు:సముద్రాల హనుమంతరావు
నగర అధ్యక్షుడు: కల్కూర మురళీధర్
నగర కార్యదర్శి: పువ్వాడి రామకృష్ణ
నగర కోశాధికారి: కావడి వినయ్
జిల్లా అధ్యక్షుడు: రఘువీర షణై
జిల్లా కార్యదర్శి: విజయతిరుపతి రెడ్డి
జిల్లా కోశాధికారి: కళ్యాణపుర కిరణ్ కుమార్