కెసిఆర్ కు ఒకఫామ్ హౌస్, కెటిఆర్ కొకటి అక్రమంగా…ఏందిదంతా? : జీవన్ రెడ్డి

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి  కె టి రామరావు (కెటిఆర్ ) కేటీఆర్ తన విలాసవంతమైన జీవనం కోసం 111 జీవోను ఉల్లంఘించారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి  జీవన్ రెడ్డి విమర్శించారు.
పర్యావరణానికి సంబంధించి ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఈ  111 జివో నిబంధనలకు విరుద్ధంగా 25 ఎకరాల్లో ఫామ్ హౌస్ ల నిర్మాణం టీఆరెస్ నాయకులు చేపట్టారని ఆయన అన్నారు. ఈ రోజు ఆయన అసెంబ్లీ  మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
అయితే,  కేటీఆర్ ప్రభుత్వ ఉత్తర్వులను  ఉల్లంఘించిన విషయాన్ని బయటపెట్టినందుకు కాంగ్రెస్ ఎంపి  రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని జీవన్ రెడ్డి అన్నారు.
‘అసలు దొంగలను పట్టుకోవడం మానేసి ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేస్తారా? 111 జివోను కాపాడాల్సిన మునిసిపల్ మంత్రి కేటీఆర్ స్వయంగా ఆయనే ఉల్లంగిస్తున్నారు. ఈ మధ్యలో   ఫామ్ హౌస్ కేటీఆర్ ది కాదు..కానీ ఆయన కొన్ని ఏండ్లుగా వాడుకుంటున్నారు అని మరొక ఎమ్మెల్యే బాల్కసుమన్ చెప్పారు. ఏమిటిదంతా?’ అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
జీవన్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే…
* కేసీఆర్ కి ఎర్రవల్లిలో ఫామ్ హౌస్- కేటీఆర్ కి జన్వాడ లో ఫామ్ హౌస్ ఎందుకు?
* 25 ఎకరాల్లో కేటీఆర్ కి ఫామ్ హౌస్ ఎందుకు.?
* పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడిరి మాయమై పోయాయి?
* సుప్రీంకోర్టు కోర్టు గైడ్ లైన్ ఉన్నాసరే, రేవంత్ అరెస్ట్ న్యాయబద్ధమైనది కాదు.
* 111 జివో తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్నదా లేదా?
* అక్రమ నిర్మాణం కి పాల్పడ్డ వారికి కాపలా ఉన్న కేటీఆర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు.
* తెలంగాణ రాష్ట్రంలో 111జివో అమలు వెంటనే చేయాలి.
* కేటీఆర్ పై 111జివో ఉల్లంఘన పై చర్యలు తీసుకోవాలి.
* రేవంత్ రెడ్డి అరెస్టు ను తీవ్రంగా ఖండిస్తున్నాను.