రేవంత్ రెడ్డిని ఎంతకు కొన్నావ్? కేటీఆర్ సీరియస్

టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారో చెప్పాలని ఉత్తమ్ చేసిన విమర్శలను ఖండించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసారు కేటీఆర్. ఆయన మీడియాతో ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే కింద ఉంది చదవండి.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు ,రేగా కాంత రావు బాహాటంగా కెసిఆర్ విధానాలు నచ్చి టీఆరెస్ లో చేరుతామన్నారు. అవసరమైతే పదవులకు రాజీనామా చేస్తామన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారో చెప్పాలని ఉత్తమ్ చేసిన విమర్శలను ఖండిస్తున్నా. ఉత్తమ్ నాయకత్వం పై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నే విమర్శలు చేశారు.

రాహుల్, ప్రియాంకల సమక్షంలో నిన్ననే యూపీ బీజేపీ ఎంపీ సావిత్రి భాయి పూలే కాంగ్రెస్ లో చేరారు. ఆమెను రాహుల్ గాంధీ ఎంతకు కొన్నారు? పార్టీలు మారడం, విధానాలు సమీక్షించుకోవడం సహజమే. ఇది కొత్త అన్నట్టు ఉత్తమ్ మాట్లాడుతున్నారు.

ఎన్నికల సమయం లో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తదితరులు కాంగ్రెస్ లో చేరారు వారిని ఎంతకు కొన్నారు? రేవంత్ రెడ్డిని ఎంతకు కొన్నారు? గతంలో మా పార్టీ ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారు? అసలు కొనడం అనే మాట తప్పు. ఇది రాజకీయ వ్యవస్థను దిగజార్చడమే.

తమ మిత్ర పక్షం టీడీపీ.. ఏపీలో 26 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నపుడు ఉత్తమ్ ఇలా ఎందుకు మాట్లాడ లేదు? ఇలాంటి చవక బారు విమర్శలు మానాలి. ఎమ్మెల్సీలు ఐదింటిని కైవసం చేసుకుంటాం అని ధీమా వ్యక్తం చేసారు టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *