కేరళలో పేదలందరికి ఉచిత హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్

పేదకుటుంబాలన్నింటికి ఉచితంగా ఇంటర్నెట్ వసతి కల్పించేందుకు కేరళ ప్రభుత్వం సిద్ధమయింది. దీనికోసం రాష్ట్రంలోని 14 జిల్లాలలో 35వేల కి.మీ ఫైబర్ ఆప్టిక్ లైన్ వేయడం ప్రారంభిచింది. ఇది పూర్తి కాగానే రాష్ట్రంలో ఉన్న 20 లక్షల బిపిఎల్ కుటుంబాలన్నింటికి ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తారు. ఇదే విధంగా పాఠశాలలు, కాలేజీలతో పాటు మొత్తం 30 ప్రభుత్వ సంస్థలన్నింటికి ఉచితి ఇంటర్నెట్ కనెక్షన్ అందిస్తారు. ఇపుడు కేవలం 10 శాతం ప్రభుత్వ సంస్థలకు మాత్రమే హై స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉంది.

రాష్ట్రంలో డిజిటల్ డివైడ్ లేకుండా చేసి ఏ కుటుంబానికి ఇంటర్నెట్ లేదనే మాట వినిపించకుండా చేసేందుకు కేరళ వామ పక్ష ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటూ ఉంది. పేదలు (బిపిఎల్ కుటుంబాలు)కాని వారికి కూడా కారు చౌకగా హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్  ఇవ్వాలన్నది ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి పనరయి విజయన్ ప్రకటించారు.. కేరళ ఫైబర్ అఫ్టిక్ నెట్ వర్క్ (KFON) ఫథకం కింది ఈ కార్యక్రమం అమలుచేస్తున్నారు.

ఇపుడు ఇంటర్నెట్ ప్రాథమిక జీవన హక్కు అయిందని, అందువల్లే ప్రభుత్వం ఈ పథకం ప్రారభించిందని అధికారులు చెబుతున్నారు. 2019లో సుప్రీం కోర్టు కూడా ఇంటర్నెట్ పౌరుల ప్రాథమిక హక్కుగా గుర్తించింది. రు.1548 కోట్లతో చేపడుతున్న ఈ కార్యక్రమం నిజానికి 2020 డిసెంబర్ నాటికే పూర్తి కావలసి ఉండింది. అయితే, కోవిడ్ కారణంగా వాయిదాపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *