నాగార్జున సాగర్ TRS టికెట్ యాదవులకే, కాని లోకల్ కు?

రెడ్డి ప్రముఖులు గుత్తా సుఖేందర్ రెడ్డి, తెరా చిన్ప రెడ్డి, కోటి రెడ్డి నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉబలాటపడుతున్నా,  ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం టికెట్ ను యాదవులకే ఇయ్యాలని నిర్ణయించినట్లు విశ్వసనీయం సమాచారం. అయితే, ఈ స్థానికులకు మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఇదే జరిగితే,  ఉప ఎన్నికల్లో సీటు మరణించిన ఎమ్మెల్యే నోముల నరసింహయ్యకుమారుడు నోముల భరత్ కు టికెట్ లేనట్లే. అంటే ఇంకొక విధంగా  మరణించిన నేతల సానుభూతి మీద అధారపడరాదనే నిర్ణయానికి వచ్చినట్లే. నోముల కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వకపోతే, విమర్శ వస్తుంది కాట్టటి, భరత్ కు ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.  దానికి తోడు భరత్ నాగార్జున సాగర్ లోకల్ కాదు. 2018 ఎన్నికల్లో నకిరేకల్ కు చెందిన నోముల నరసింహయ్యను  తీసుకువచ్చిన జానారెడ్డి  మీద పోటీకి పెట్టారు.

నోముల నర్సింహ్మయ్యతోతనయుడు భరత్యా దవ్

ఈ సారి స్థానికుడికి, యాదవ అభ్యర్థిని నిలబెట్టాలనిసూత్రప్రాయంగా నిర్ణయించినట్లు టిఆర్ ఎస్ వర్గాలనుంచిఅందుతుతన్న సమాచారం.

స్థానికి యాదవులకు సంబంధించి  ముగ్గురు అభ్యర్థలను పరిశీలించారు. వారి పేర్లు: పెద్దబోయిన శ్రీనివాసయాదవ్ (త్రిపురారం మండలం),మన్నెం రంజిత్,కట్టెబోయిన గురువయ్య(నిడమనూరు మండలం).

ఈ ముగ్గురిలో కూడ గురువయ్యకు ఎక్కువ అవకాశాలున్నట్లు తెలిసింది. గురువయ్య మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తియాదవ్ అల్లుడు. పార్టీ రాజ్యసభ సభ్యుడు  బాడుగుల లింగయ్య యాదవ్ కు దగ్గిర బంధువు. ఎలెక్షన్ కమిషన్ ఉప ఎన్నిక షెడ్యూల్ ను ప్రకటించగానే అభ్యర్థి పేరును వెల్లడిస్తారని, గురువయ్యకే అవకాశం ఎక్కువగా ఉందని  తెలిసింది.

దుబ్బాక ఉప ఎన్నికలో ఎమ్మెల్యే సోలిపెట రామలింగారెడ్డి చనిపోయిన పుడు  సానుభూతిని నమ్ముకుని భార్య సుజాతను నిలబెట్టారు. బిజెపి విమర్శలముందు రామలింగారెడ్డి కుటుంబం మీద  సానుభూతి పనిచేయలేదు. అందువల్ల నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో సానుభూతి అనే జిమ్మిక్ ద్వారా కాకుండా కులం కార్డు ప్రయోగించాలని పార్టీనేత నమ్ముతున్నారని టిఆర్ ఎస్ నాయకులు చెబుతున్నారు. దీనికోసం ఈ నియోజకవర్గం మెజారిటీ అయిన యాదవులను ఓట్లు పక్కకు పోకుండా ఉండేందుకు స్థానిక యాదవ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించారని వారు చెబుతున్నారు.

 

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/top-stories/features/politicla-parties-ignoring-yadavas-in-nagarjuna-sagar-assembly-contituency-telangana/

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *