Home Breaking ప్రచారం లేకుండా ఇంత ఘన విజయం, ఎపుడూ చూల్లే: కెసిఆర్

ప్రచారం లేకుండా ఇంత ఘన విజయం, ఎపుడూ చూల్లే: కెసిఆర్

76
0
మునిసిపల్ ఎన్నికల్లో అఖండ విజయం తర్వాత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్  రావు తెలంగాణ భవన్ లో  విలేకరులతో మాట్లాడుతూ తన జీవితంలో ఇలాంటి వేవ్ చూడలేదని, ప్రచారానికి పోకుండానే విజయం సాధించామని అన్నారు.
ముఖ్యమంత్రి ఇంకా ఏంచెప్పారంటే…
మున్సిపల్ ఎన్నికలు ఒక టాస్క్ లాగా తీసుకోని పనిచేశాము. లోకల్ లెవల్ లో కష్టపడ్డాము. టీఆరెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 80 లక్షల నుంచి కోటి వరకు పార్టీ మెటీరియల్ పంపింది అంతే. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టం ప్రకారమే మున్సిపోల్స్ గెలిచాము. మొదటినుంచి క్రమశిక్షణతో ఉన్న పార్టీ టీఆరెస్. 10 మంది ఎమ్మెల్యే లతో మాట్లాడను. అధికార దుర్వినియోగం అనేది ఎక్కడ జరగలేదు.వేల కోట్లు ఎక్కడ ఖర్చు చేశారో ప్రతిపక్షాలు చెప్పాలి
నా అనుభవంలో ఇలాంటి విజయం ఎప్పుడూ చూడలేదు.ఈ విజయం మా భాధ్యతను మరింత పెంచింది. గెలిచినంత మాత్రాన టీఆరెస్ నేతలకు ఎవ్వరికి గర్వం అవసరం లేదు. త్వరలో గెలిచిన నేతలకు పట్టణ ప్రగతి కోసం శిక్షణ తరగతులు. భవిష్యత్ లో తెలంగాణ రాష్ట్రానికి కొత్త ఛాలెంజ్ రాబోతుంది.అర్బన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం 20 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్నాము
57 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికి వృద్ధ్యప పెన్షన్ ఫిబ్రవరి తరువాత ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని త్వరలోనే పెంచుతాము.
కేంద్రం సరిగ్గా పనిచేయడం లేదు
తెలంగాణకు 5వేల కోట్ల బకాయిలు కేంద్రం నుంచి రావాలి.ఇంకా 1131 కోట్లు జిఎస్టీ కింద రావాల్సి ఉంది. త్వరలో ఉద్యోగులతో సమావేశం ఉంటుంది.పీఆర్సీ పెంచాలి కాబట్టి కచ్చితంగా ఎంతో కొంత పెంచుతాము.గత ఐదేళ్ల క్రితం కాగ్ రిపోర్ట్ ప్రకారం ప్రతి ఏటా 21శాతం జీడీపీ వృద్ధి ఉండేది.ఈ ఏడాది 9.5 గ్రోత్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది.తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ కోసం కార్యాచరణ ప్రారంభిస్తాం
త్వరలో నేను గల్ఫ్ పర్యటనకు వెళ్తాము
గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక పాలసీ ఏర్పాటు చేస్తాం. 15 మంది ఎమ్మెల్యేలతో కలిసి గల్ఫ్ పర్యటన కు వెళ్తాము.
రెవిన్యూ శాఖకు సర్జరీ అవసరం
తెలంగాణ రాష్ట్రంలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది.కాంగ్రెస్-టీడీపీ తెలంగాణ కు నిరక్షరాస్యత మాత్రమే ఇచ్చింది.న్యూ రెవెన్యూ చట్టం త్వరలో తెస్తాం..పార్లమెంట్ సెషన్స్ లో ఏర్పాటు.రెవెన్యూ శాఖకు తప్పకుండా సర్జరీ అవసరం. పటిష్టమైన రెవెన్యూ చట్టం తెస్తాం.రెవెన్యూ ఉద్యోగులూ అపోహలు నమ్మొద్దు.
CAA బిల్లు ఉపసంహరించుకోవాలి
కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణచట్టం (CAA)  అనేది తప్పుడు నిర్ణయం. బిల్లులో ముస్లిమ్ లను పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. CAA పై చాలా మంది సీఎంలతో మాట్లాడను. త్వరలోనే దేశంలోని సీఎంలతో సమావేశం ఏర్పాటు చేస్తాం.దేశం పై హిందుమత దేశంగా మార్చేందుకు బీజేపీ చేస్తోంది. CAA కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తాం.16మంది సీఎంలు-మాజీ సీఎం లు CAA కు అనుకూలంగా లేరు. కేంద్ర ప్రభుత్వం CAA ను విరమించుకోవాలి
పన్ను పెంచాలి, భారం లేకుండ చేస్తాం
భివృద్ధి జరగాలి అంటే మున్సిపాలిటీ-గ్రామపంచాయతీ పన్ను పెంచాలి.పేదల పై భారం పడకుండా టాక్స్ లో సవరణలు చేస్తాం.3వందల కోట్లతో రైతు వేదికలను త్వరలో ఏర్పాటు చేయబోతున్నాము.రైతులే ధరలను నిర్ణయించే కార్యాచరణ రూపోయిందిస్తున్నాము.ఐకెవి ఉద్యోగులకు భద్రతకల్పిస్తాము.కేబినెట్ సబ్ కమిటీ వేసి ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తాం.కాళేశ్వరం ప్రాజెక్టు లో పెండింగ్ లో టెండర్లు త్వరలో పిలుస్తాము.దుమ్ముగూడెం బ్యారేజ్ త్వరలో ప్రారంభిస్తాం.నిరుద్యోగ భృతి అనేది కొంత సమయం పడుతుంది