Home Breaking తల్లి గోదావరికి కెసిఆర్ పూజలు, సారె సమర్పణ

తల్లి గోదావరికి కెసిఆర్ పూజలు, సారె సమర్పణ

90
0
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఈ రోజుజయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర క్షేత్రాన్ని సందర్శించారు.సీఎం కేసీఆర్‌ కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ముక్తేశ్వర స్వామికి అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.
అంతకుముందు పుష్కరఘాట్‌లో గోదావరిమాతకు కేసీఆర్‌ పూజలు చేశారు. గోదావరినదిలోకి నాణేలు వదిలారు. తల్లి గోదావరికి చీర, సారె సమర్పించారు. కేసీఆర్‌ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, మంత్రులు ఈటల రాజేందర్‌, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఉన్నారు.