పలు రాష్ట్రాలలో కరోనా మూడోవిడత దాడి చేస్తూ ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కేంద్రం డిసెంబర్ నెల కోసం కొత్త నియమాలనువిడుదల చేసిన సందర్బంగా ఆయన ఈ విజ్ఞప్తి చేశారు.
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతున్నది. అందువల్ల
1. విధిగా మాస్కును ధరించండి
2. భౌతిక దూరం పాటించండి
3. గుంపులుగా కలవకండి
4. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోండి
5. కరోనా వైరస్ సోకినట్లుగా అనుమానం వస్తే మీ దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ టెస్ట్ ఉచితంగా చేయించుకోండి
6. ఒకవేళ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లైతే ఉచితంగా కోవిడ్ ట్రీట్మెంట్ కిట్ ను పొందండి. డాక్టర్ సలహాలు, సూచనలు పాటిస్తూ మందులు వాడండి.
7. తెలంగాణ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత ప్రజల ఆరోగ్య పరిరక్షణే.
ఇది ఇలా ఉంటే డిసెంబర్ నెల కోసం కేంద్రం కొత్త కరోనా నియమాలు విడుదల చేసింది. వివరాలు: