Home Breaking కర్నాటక బ్యాంకుల్లో కన్నడమే వినిపించాలి, కనిపించాలి: ఆదేశాలు

కర్నాటక బ్యాంకుల్లో కన్నడమే వినిపించాలి, కనిపించాలి: ఆదేశాలు

100
0
అధికార భాషను పరిపాలనలో అమలుచేయడంలో కర్నాటక మరొక అడుగు ముందుకేసింది. ఇక నుంచి కర్నాటక లోని బ్యాంకులన్నింటిలో వ్యవహారాలు కన్నడంలోనే నిర్వహించాలని ఆదేశించింది. కష్టమర్ల సర్వీసుకు సంబంధించిన ప్రతివిషయంలో కన్నడ భాషే ముందుండాలని, కన్నడం ప్రముఖంగా వినిపించాలని, కనిపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాదు, బ్యాంకుల బోర్డులలో ప్రధానంగా కనిపించాల్సింది కూడా కన్నడంలో రాసిన పేరేనని పేర్కొంది. బోర్డులో 60 శాతం పైగా కన్నడ భాష కనిపించాలని కూడా తెగేసి చెప్పింది.
దీనినంతా #ServiceInMyLanguage ప్రచారంలో భాగంగా సాగుతూ ఉంది.
కర్నాటక గ్రామీణ ప్రాంతాల బ్యాంకులలో కూడా కన్నడం వాడ కుండా బ్యాంకులను కస్టమర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని వచ్చిన ఫిర్యాదులకు స్పందిస్తూ కన్నడ రాష్ట్రం ఈ చర్య తీసుకుంది.
బ్యాంకులలో కన్నడ భాషను పాలనా భాషగా అమలుచేసేందుకు కన్నడ డెవెలప్ మెంట్ అధారిటీ అధ్యక్షుడు టి ఎస్ నాగాభరణతో కలసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టి ఎం విజయ్ భాస్కర్ బ్యాంకుల్లో కన్నడం అమలుకు చర్యలు ప్రారంభించారు.
రాష్ట్రస్థాయి బ్యాంకర్లు కమిటీ సమావేశం (ఎస్ ఎల్ బిసి) లో ప్రభుత్వ నిర్ణయాన్ని విజయ్ భాస్కర్ సూటిగా ప్రకటించారు.
‘సిబ్బందికి కన్నడ భాష వచ్చేలా అన్ని బ్యాంకులు చర్యలుతీసుకోవాలి. వాళ్లంతాబ్యాంకుల్లో కన్నడమే మాట్లాడాలి. అంతేకాదు, బ్యాంకుల వెబ్ సైట్ లు కూడా కన్నడంలోనే ఉండాలి. బ్యాంకులలో కస్టమర్లకు అవసరమయ్యే ప్రతికాగితం ముక్క కన్నడంలోనే ఉండాలి,’ అని స్పష్టంగా ఆదేశాలిచ్చారు.
‘కర్నాటక గ్రామీణ ప్రాంతాల బ్యాంకులలో కన్నడేతరులు పనిచేస్తున్నారు. వారితో కన్నడ ప్రజలు కష్టాలుపడుతున్నారు. ఈ సమస్య గురించి చాలా రోజులుగా బ్యాంకుల దృష్టికి తీసుకవస్తున్నాం,’ నాగా భరణ కూడా దెక్కన్ హెరాల్డ్ కు చెప్పారు.
‘పట్టణ ప్రాంతాల బ్యాంకులలో ఇదే పరిస్థితి ఉంది. బ్యాంకుల కార్యకలపాలు పొల్లుపోకుండా జరగాలంటే అన్నింటా కన్నడ భాష వాడాలి. ఎటిఎమ్ లలో కూడా కన్నడ భాష వాడాలి,’ ఆయన చెప్పారు.
కర్నాకటలో 41 బ్యాంకులున్నాయి. వాటికి 11,286 శాఖలున్నాయి. ఇందులో చాలా మటుకు గ్రామీణ, చిన్నపట్టణ ప్రాంతాలలో ఉన్నాయి. ఇక్కడ కన్నడ ప్రజలకుకష్టాలొస్తున్నాయి.
‘ కన్నడ భాష తెలియని సిబ్బంది కోసం,ముఖ్యంగా నిత్యం ప్రజా సంపర్కం లో ఉండే సిబ్బంది కోసం భాష నేర్పించే శిక్షణ కార్యక్రమం ఏర్పాటుచేయాలని ఎపుడో బ్యాంకులకు లేఖ రాశాం,’ అని ఎస్ ఎల్ బిసి కన్వీనర్, సిండికేట్ బ్యాంక్ జనరల్ మేనేజర్ మనివన్నన్ చెప్పారు.
బ్యాంకు దరఖాస్తు ఫారాలలో కన్నడం కనిపించితీరాలని తాము బ్యాంకులకు చెబుతూనే ఉన్నామని సిండేకేట్ బ్యాంకు ఫారాలలో కన్నడ భాష వాడతున్నామని,త్రి భాషా సూత్రం అమలు చేయడం వీలుకాకపోతే, కనీసం ఇంగ్లీషు కన్నడ భాషలలోనైనా బ్యాంకుల ఫారాలు తీసుకురావాలని మనివన్నన్ తోటి బ్యాంకర్లకు సూచించారు.
బ్యాంక్ సైన్ బోర్డులలో 60 శాతం స్థలం కన్నడ భాషకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించింది. నవంబర్ 2019లో బిబిఎంసి కెనరా బ్యాంకుకు ఈ విషయంలో ఒక నోటీసు కూడా జారీ చేసింది. ఇలా బోర్డులను మార్చినందున తమ బ్యాంకు బ్రాండ్ఐడెంటిటీ పోతుందని, అది చాలా ఆర్థిక భారం మోపుతుందని బ్యాంకు వాదిస్తున్నది.
#ServiceInMyLanguage అనేది కన్నడ భాష అమలు ప్రచారం కోసం మొదలయిన హ్యాష్ టాగ్. బ్యాంకింగ్ సెక్టర్ లో కన్నడ భాష కు మొదటి ప్రాముఖ్యం ఇవ్వాలనే వాళ్లంతా ఇపుడు ఈ హ్యాష్ ట్యాగ్ కింద పని చేస్తున్నారు. కన్నడిగులకు బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు ఎక్కువగా లభించాలంటే కన్నడ భాష అధికార భాష కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సొనెల్ సెలెక్షన్ లో కన్నడ భాష మాధ్యమం కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.