Home Breaking జగన్ రాజధానిని విశాఖకు ఎందుకు మారుస్తున్నాడు? : కన్నా లాజిక్

జగన్ రాజధానిని విశాఖకు ఎందుకు మారుస్తున్నాడు? : కన్నా లాజిక్

110
0
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు  కన్నా లక్ష్మీ నారాయణ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద, ఆయనతొమ్మిదినెలలపాలన మీద నిప్పులు చెరిగారు.అమరావతిలో మహిళలు సాగిస్తున్న మహిళలను ప్రశంసించారు.
అధికారంలోకి వచ్చి నాటి నుంచి తొమ్మిది మాసాల పాలన గమనిస్తే 2014 లో అధికారం ఇవ్వలేదనే అక్కసుతో ప్రధాన ప్రజల పై కక్ష తీర్చుకుంటున్నారని ఆయన వాఖ్యానించారు. జగన్ తీరు చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ లాక్కుపోయినట్లుందని ఆయన విమర్శించారు. అమరావతిలోఉన్నదాన్నంతా చంద్రబాబునాయుడు దోచుకున్నాడని, తనకేమి మిగల్లేదని,తాను దోచుకునేందుకే రాజధానిని విశాఖపట్నానికి మార్చాలనుకుంటున్నాడని ఆరోపించారు.
అమరావతిలో  75రోజులుగా పట్టు వదలకుండా పోరాటం సాగిస్తున్న మహిళళనుద్దేశించి ఆయన ప్రసంగించారు.
అమరావతి కోసం మహిళా మూర్తులు పోరాటానికి ధన్యవాదాలు తెలిపారు.
’ఎంతోమంది విరాళాల రూపంలో అమరావతి నిర్మాణానికి ఇచ్చారు.నేను వస్తే అమరావతి ఇక్కడే ఉంటుంది.. మంచి రాజధాని చేసి చూపిస్తా అన్నావు.  ఎన్నిసార్లు మాట తప్పావు.. మడమ తిప్పావు. ఇప్పుడు ఆ మడిమ నీకు ఉందా లేదా చెప్పాలి,‘ అని తీవ్రంగా జగన్ మీద విరుచుకుపడ్డారు.
ఆనాడు జగన్ తో సహా అన్ని పార్టీ లు అమరావతి కి అంగీకరం తెలిపాయని నాటి ప్రభుత్వం పై నమ్మకం తో మీరంతా 34వేల ఎకరాలు ఇచ్చారని, అందుకే ఆ ప్రభుత్వాన్ని నమ్మి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారని ఆయన అన్నారు.
 మూడు రాజధానులు కావాలని ఎవరు అడిగారు. అమరావతి లో చంద్రబాబు అన్నీ‌ దోచుకున్నారు..‌ నాకు మిగలలేదని జగన్ బాధ పడుతున్నాడని కన్నా అన్నారు.
అమరావతి ఎపికి ఏకైక రాజధానిగా ఉండాలనే బిజెపి చెబుతుంది . అమరావతి ప్రాంతం లో మంచి రాజధాని నిర్మాణం కోసం బిజెపి కట్టుబడి ఉందని చెబుతూ త్వరలో అమరావతి కోసం బిజెపి, జనసేన కలిసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాయని ఆయన వెళ్లడించారు.
అందుకే‌ జగన్  విశాఖ రాజధాని పేరుతో దోచుకోవాలని చూస్తున్నారనిఆన్నారు.
తొమ్మిది నెలల్లోనే నీకు ఎందుకు అంత భయం పట్టుకుంది.ప్రతిపక్ష నేతలను బ్లాక్ మెయిల్ చేసేలా జగన్ మాట్లాడుతున్నావుని ఆయన విమర్శించారు.
కన్నా లక్ష్మినారాయణ ఇంకా ఏమన్నారంటే…
పేదవాడికి పార్టీ ఏంటి.. మరో పార్టీకి అండగట్టి  ఇల్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. పేదలకు పార్టీ అంటగట్టి న పాలకులను తొలిసారిగా చూస్తున్నాను. ఈ రాష్ట్రంలో కూల్చడం, పాడు పెట్టడం తప్ప చేసిందేమిటి. అవినీతి రహిత పాలన అన్నావు. నీ అండ దండ లతో అవినీతి పెరిగిపోయింది. .రాష్ట్రంలో‌ అవినీతి లేదని చెప్పే ధైర్యం నీకు ఉందా? నెల రోజుల పాలనతోనే జగన్ కు తన యంత్రాంగం పై పట్టు పోయింది. నీ అండదండలు లేకుండా అవినీతి జరుగుతుందా. లేదంటే మీ పార్టీ నాయకుల అవినీతి కి అడ్డుకట్ట వేయి. 2014-19 మధ్య అవినీతి జరిగింది.నీ అవినీతి కోసం ఏ స్థాయికైనా దిగజారి వ్యవహరిస్తున్నావు
ఎవరు మాట్లాడినా వారి పై కేసులు పెట్టిస్తున్నావు. 144, 30సెక్షన్ పెట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతు నొక్కుతున్నారు. అమరావతి అనేది ఐదు కోట్ల ఆంధ్రుల సమస్య. ఎపి లో పెట్టుబడులు పెట్టడానికి ధైర్యం చేయడం లేదు. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని సంకన పెట్టుకుంటే ఎలా? రేపు మరొకరు వచ్చి రాజధాని మార్పు అంటారు. ఇలా ఉంటే ఎపి లో ఎవరూ పెట్టుబడులు పెట్టరు. నేడు విశాఖలో కూడా మీరొస్తున్నారని భయపడుతున్నారు. విజయనగరం లో కూడా జనం జగన్ వస్తే మా ఆస్తులు కబ్జా అవుతాయని భయపడుతున్నారు. ప్రశాంతంగా మేము బతుకుతున్నాం అంటున్నారంటే .. జగన్ సిగ్గు తో తలదించు కోవాలి.