అంతర్జాతీయ ధ్యాన కేంద్రంగా హైదరాబాద్, 29న కన్హ శాంతివనం ప్రారంభం

ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం (మెడిటేషన్ సెంటర్)హైదరాబాద్ లో రాబోతున్నది. ఈ మెడిటేషన్ హాల్ ను జనవరి 29న ప్రారంభిస్తున్నారు. హార్ట్ ఫుల్ నెస్ ఇన్ స్టిట్యూట్  ను దీనిని ఏర్పాటుచేస్తున్నది. ఈ సంస్థ ఏర్పాటయిన 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా జనవరి 29 ఈ మందిరాన్ని ప్రారంభిస్తున్నారు.  మందిరం కన్హ శాంతివనంలో భాగం. ఇది ఈ సంస్థకు గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ గా పని చేస్తుంది. ఇందులో ఒకేసారి  1.2 లక్షల మంది ధ్యానం చేసుకునేందుకు వీలుకుంటుంది. హార్ట్ ఫుల్ నెస్ ఉద్యమాన్ని స్థాపించిన లాలాజీ  స్మతిమీద వనం ఈఏర్పాటవుతున్నది.
ఈ సంస్థ 75వ వార్షికోత్సవాలను జనవరి 29 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరుగుతాయి. ఈ సందర్భంగా రాష్ట్ర పతి రామ్ నాత్ కోవింద్, అన్నా హజారే,  బాబా రామ్ దేవ్  ఉత్సవాలలో పాల్గొంటారు.
కన్హ శాంతి వనం లేదా కన్హ గ్రామం రంగారెడ్డి  జిల్లాలో నందిగామ మండలం చేగూరు గ్రామ సమీపంలో ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు 25కి.మీ దూరంలో ఉంటుంది.
నిజానికి శాంతివనాన్ని ఒక ఆధ్యాత్మిక పట్టణంగా అన్ని ఆధునిక వసతులతో నిర్మిస్తున్నారు. ధ్యాన మందిరం చుట్టూ అనేక రెసిడెన్షియల్ కాలనీలను కూడా నిర్మిస్తున్నారు. హార్ట్ ఫుల్ నెస్ ప్రేమికులు ప్రపంచవ్యాపితంగా పెరిగిపోతున్నందున ఈ మహావనం ఏర్పాటు చేయాల్సి వచ్చింది.దీనికి వారు హైదరాబాద్ ను కేంద్రంగా ఎంచుకున్నారు . సహజ మార్గ ధ్యానాన్ని వీరంతా ప్రాక్టీస్ చేస్తారు.
ప్రశాంత ఆధ్యాత్మిక వాతావరణంలో, పచ్చని పొలాల మధ్య యోగ, ధ్యాన శిక్షణ పొందేందుకు వీలుగా ఇక్కడి వాతావరణం తయారవుతూఉంది. 5వేలమంది ఉండేందుకు డార్మిటరీలను నిర్మిస్తున్నారు. వారికోసం  ఒక పెద్ద డైనింగ్ హాల్ ను ఏర్పాటుచేస్తున్నారు. భారీ కిచెన్ ఉంటుంది. 50 వేల మంది కొన్ని వారాల పాటు ఉండేందుకు లోటులేకుండా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వనంలో దాదాపు ఇప్పటిదాకా 50 వేల చెట్టు నాటారు.