Home Breaking ఎపికి బిజెపి అవసరం చాలా ఉంది, బేషరతుగా స్నేహం: పవన్

ఎపికి బిజెపి అవసరం చాలా ఉంది, బేషరతుగా స్నేహం: పవన్

97
0
భారతీయ జనతా పార్టీ, జనసేన మళ్లీ దగ్గిరయ్యాయి. మొన్న ఢిల్లీ వెళ్లి తాను బిజెపితో కలిసి పనిచేసేందుకు సిద్ధమని జనసేన నేత పవన్ కల్యాణ్ స్పష్టం చేసి వచ్చాక, ఈ రోజు విజయవాడలో రెండు పార్టీలనేత మధ్య కీలక సమావేశం జరిగింది. రెండు పార్టీలు ప్రస్తుతానికి టిడిపి, వైసిపిలకు ప్రత్యామ్నాయం కోసం పనిచేస్తాయని ప్రకటించాయి.
బిజెపి తరఫున రాష్ట్ర కమిటి అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జివిఎల్ నరసింహారావు, పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇన్ చార్జ్, సునీల్ దేవదర్,మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి పాల్గొన్నారు. సమావేశం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ టిడిపి, వైసిపిలకు ప్రత్యామ్నయం కోసం తాను బిజెపితో పనిచేయాలని బేషరతుగా నిర్ణయించుకున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే…
జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి మోడీ ని ఇష్టపడే వ్యక్తి ని. మనస్ఫూర్తిగా  ఈ‌కలయిక జరుగుతున్నది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  బిజెపి అవసరం ఎలా ఉంది. అవినీతి రహిత నాయకులు అయితేనే మంచి పాలన అందిస్తారు.ఆ తర్వాత మా మధ్య కొంత గ్యాప్‌ వచ్చింది 2014 ఎన్నిలక తర్వాత.  ఇటీవలబిజెపి పెద్దలతో లోతుగా చర్చలు జరిపాం. ఎక్కడ గ్యాప్ వచ్చిందనే అంశాలను చర్చించాం. ఇక నుంచి బిజెపి తో కలసి పయనించాలని నిర్ణయించాం. ఎపి లో సునీల్ ధియోధర్ నేతృత్వంలో కలిసి వెళతాం. కులతత్వం, అవినీతి పాలనను అంతం చేయాలనేది మా ఉద్దేశం.గతంలో టిడిపి, ఆ తర్వాత జగన్ పాలనతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. టిడిపి హయాంలో అన్ని‌వేల ఎకరాలు ఎందుకు అని నేను ప్రశ్నించాను. జగన్ వచ్చి రైతులు, మహిళల ను రోడ్డు మీద పడేశారు. ఆంధ్రప్రదేశ్ రక్షణ, అభివృద్ధి కోసం అన్ కండీషనల్ గా ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తు లో అవగాహన లోపాలు లేకుండా చర్చించాం.ఇరు పార్టీ ల‌ నేతలతో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం.వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బిజెపి, జనసేన కలయిక తో‌ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది.పాలెగాళ్ల రాజ్యం తో ప్రజలు‌ విసిగిపోయారు. టిడిపి, వైసిపి ల ప్రత్యామ్నాయ పార్టీ అధికారం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.ప్రజా సమస్యలు పరిష్కారానికి జిల్లాల‌ వారీగా పని చేస్తాం
కన్నా లక్ష్మినారాయణ
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నాలక్ష్మినారాయణ మాట్లాడుతూ బిజెపి తో కలిసి పని చేయాలని  పవన్ కల్యాణ్  అన్ కండీషనల్ గా ముందుకు వచ్చారని,  దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ తీసుకున్న నిర్ణయం అభినందిస్తున్నానని అన్నారు.
‘2019ఎన్నికలలో టిడిపి లోపాలను ఎత్తి చూపి ఒక్క అవకాశం పేరు చెప్పి జగన్ అధికారం లోకి వచ్చారు. రెండు పార్టీలు కూడా రాష్ట్రాన్ని అధంపాతాళంలోకి‌ నెట్టాయి. అవినీతి, అరాచకం, కుటుంబ పాలన తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. జగన్ నియంత పాలన సాగిస్తూ అన్ని వర్గాల వారిని ఇబ్బందులు పెట్టారు. రాష్ట్రం లో మంచి ఆలన, ప్రజలకు మేలు చేసేలా బిజెపి, జనసేన లు కలిసి పని చేస్తాయి..024 అధికారమే లక్ష్యం గా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళతాం.జగన్, చంద్రబాబు పాలనలతో ప్రజలు విసిగిపోయారు.ఈ రెండు పార్టీలు అన్ని అంశాల పైనా కలిసి పోరాడతాం.’
సమావేశంలో జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.