మాస్క్ ధరించక పోతే 8 రోజుల జైలు శిక్ష

బహిరంగ ప్రదేశాలలో మాస్క్ లేకుండా తిరిగే వారిని  ఎనిమిది రోజుల పాటు జైలుకుపంపాలని హిమాచల్ ప్రభుత్వం నిర్ణయించింది.
మాస్క్ లేకుండా ఎవరైనా కనబడితే, వారంటు లేకుండా అక్కడ అరెస్టు చేయవచ్చు. ఈ నేరం రుజువయితే ఎనిమిది రోజుల దాకా జైలు శిక్ష పడుతుంది. బహుశా, దేశంలో మాస్క్ ధారణకు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్న రాష్ట్రం హిమాచలే కావచ్చు.
మాస్క్ లేని వారి మీద విధించే జరిమాన రు.5 వేలా దాకా ఉంటుంది.
మాస్క్ లేని వారిని అరెస్టు చేసి కేసు పెట్టి జైలుకుపంపాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్లకు ఆదేశాలిచ్చినట్లు డిజిపి సంజయ్ కుందు వెల్లడించారు. కరోనా వ్యాపించకుండా ఉండేందుకు  ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉత్తరభారతదేశంలోని పలు రాష్ట్రాలలో కరోనా మూడో విడత వ్యాపిస్తూ ఉండటంతో చాలా రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి.
మాస్క్ ధరించాలనే నియమg అమలవుతీరును, సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని డ్రోన్ ల ద్వారా, సిసి కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు.
రాష్ట్రంలో ఇంతవరకు మాస్క్ ధరించని వారి నుంచి రు.1,24,22,450 వసూలు చేసినట్లు డిజిపి కుందు చెప్పారు.
మార్చి 23న లాక్ డౌన్ విధించినప్పటి నుంచి ఇప్పటి దాకా హిమాచల్ ప్రదేశ్ 31,317 కేసులను బుక్ చేశారని కూడా వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *