17 మంది టిడిపి ఎమ్మెల్యేలు గోడ దూకడానికి రెడీ : సజ్జల రామకృష్ణారెడ్డి

ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు నాయుడు మీద ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు  సజ్జల రామకృష్ణ రెడ్డి అమరావతిలో సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు.
శాసనమండలిని రద్దు చేయకుండా బిజెపిని రంగంలోకి దించాలని చూస్తున్నారని, దీనికోసం పెద్ద ఎత్తున బేరసారాలు నడుపుతున్నారని ఆయన ఆరోపించారు.ఈ రోజు అమరావతిలో మాట్లాడుతూ ఆయన చాలా ఆసక్తి కరమయిన విషయాలు వెల్లడించారు. అంతేకాదు టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలో 17 మంది వైస్సార్సీపీ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్లందరిని తీసుకుని ఏంచేయాలనేదే వైసిపి ప్రశ్న అని ఆయన  అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవతరం నాయకుడని,డబ్బుతో ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొనే వాడుకాదని ఆయన అన్నారు.
రెండెళ్లు మండలి రద్దు కాకుండా ఆపితే  తెలుగు దేశం పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్సీ లను బీజేపీలోకి పంపుతాను చంద్రబాబు కొరారని ఆయన చెప్పారు.
సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన విషయాలివే
బీజేపీ నేత అమిత్ షా తో మాట్లాడి మండలి రద్దు అండ్డుకుంటానని చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్సీలకు చెపుతున్నాడు. అమిత్ షా తో మాట్లాడినట్లు స్పీకర్ ఆన్ చెేసి చంద్రబాబు  మాట్లాడారని టీడీపీ ఎమ్మెల్సీలు చెపుతున్నారు. 18 మంది ఎమ్మెల్సీ లను బీజేపీలోకి పంపుతాను రెండు ఏళ్లు మండలి రద్దు కాకుండా ఆపాలని చంద్రబాబు కొరరంటా.అవతలి వ్యక్తి ఒక సవత్సరం అవుతానని చెప్పారంటా. మీకు అమిత్ షా ఎందుకు లైన్ లోకి వస్తాడు అని టీడీపీ ఎమ్మెల్సీలు అడిగితే చంద్రబాబు దగ్గర సమాధానం లేదంటా.
సుజనాచౌదరి వంటి వాళ్ళను బీజేపీ లోకి పంపినట్లే టీడీపీ ఎమ్మెల్సీలను బీజేపీలోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీలోకి పంపి మండలిని అడ్డుకునే ప్రయత్నం చేస్తామని చంద్రబాబు చెపుతున్నాడు. ఒక సంవత్సరం ఆగితే మాకు మెజార్టీ వస్తుంది.
మండలి రద్దు పై ఒక చర్చ జరిగితే బాగుంటుంది అనే ఉదేశ్యం తో కొంత సమయం ఇవ్వడం జరిగింది. మండలి అనేది ఒక పవర్ సెంటర్ కాదు. కేవలం సలహాలు సూచనలను ఇవ్వడమే మండలి పని. మేధావులు విద్యా వేత్తలు కొంత మందికి అవకాశం ఇవ్వడం కోసం మండలి ఏర్పాటు చేశారు.
అయితే, మండలి తన పరిధి దాటి వ్యవహరించింది. రాజదానిపై చర్చించి సీఎం ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. చేతిలో మీడియా ఉంది కాబట్టి చంద్రబాబు ఒక హైప్ క్రియేట్ చేశారు.
రాజదానిపై ప్రజలను ఎలా మోసం చేశారో ఇప్పుడు హైప్ క్రియేట్ చేసి మోసం చేశారు.సెలెక్ట్ కమిటీకి బిల్లును పంపి చేసేది ఏమి లేదు.మండలిలో వెకిలి చేష్టలు పిల్ల చేష్టలు చేశారు. సెలెక్ట్ కమిటీకి వెళ్లాలా వద్దా అనేదానిపై వోటింగ్ కూడా పెట్టలేదు. టీడీపీ కార్యకర్తలా చైర్మన్ వ్యవహరించారు.
గ్యాలరీలో చంద్రబాబు మూడున్నర గంటలు ఎందుకు కూర్చున్నారు? ఏమి సాధించారని చంద్రబాబు సంబరాలు చేసుకుంటున్నారు. బిల్లులను అడ్డుకోవడం వలన మాకు వచ్చిన నష్టం ఏమి లేదు. బేరసారాలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మండలి రద్దు చేస్తే కేంద్రం ఆమోదించకుండా ఉంటుందా. కొంత ఆలస్యం మాత్రమే అవుతుంది…
జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లుతో ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపారు.ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎందుకు ఇలా చేశారు అనేది మా ప్రశ్న.ఓటుకు కోట్లు కేసుకు భయపడి హైదరాబాద్ నుంచి అమరావతి కి చంద్రబాబు వచ్చాడు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను అమలు చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. చంద్రబాబు కృత్రిమ ఉద్యమం రాజదానిలో చేయిస్తున్నాడు.