రేపు మరోసారి ఢిల్లీకి సీఎం జగన్‌.. కారణం కౌన్సిల్ రద్దు విషయమేనా?

అమరావతి :ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి   మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. ఈసారి ఆయన హోం మంత్రి అమిత్ షా తో ప్రత్యేకంగా మాట్లాడతారు పర్యటించనున్నారు.
బుధవారం నాడు ఢిల్లీలో జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయి రాజధాని తరలింపు, కౌన్సిల్ రద్దు విషయాల మీద కూలంకషంగా చర్చించారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో ఈ విషయాలమీదే ప్రధానంగా చర్చ సాగించినట్లు సమాచారం. అమరావతి తాను ఎందుకు వికేంద్రీకరించాలనుకుంటున్నది, కౌన్సిల్ ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నది ఆయన ప్రధానికి వివరించారు.  కౌన్సిల్ రద్దు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి సాధ్యమయినంత తొందరగా రద్దుచేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ప్రధానిని కోరారు.
 కౌన్సిల్ రద్దు ప్రాసెస్ ప్రారంభించాల్సింది కేంద్రహోం శాఖ. అందువల్ల ఈ విషయాన్ని రింతకూలంకషంగాచర్చించేందుకు  ఆయన ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలుసుకుంటున్నట్లు సమాచారం.
ఈ విషయాలమీద  అమిత్ షాను కలిసి  చర్చించాలనిప్రధానియే సూచించారని, బుధవారం  నాడు షా బిజిబిజీగా ఉండటంతో కలిసే అవకాశం జగన్ కు దొరకలేదని చెబుతున్నారు. అందుకే  శుక్రవారం నాడు షా అపాయిట్మెంట్ దొరికిందని, ఆయనతో జగన్ భేటీ అయ్యి అన్ని విషయాలను చర్చిస్తారని ఇక్కడి పార్టీ వర్గాల్లో వినబడుతూ ఉంది.