Home Breaking ఆంధ్ర మీద జగన్ వరాల జల్లు, కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన

ఆంధ్ర మీద జగన్ వరాల జల్లు, కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన

173
0
ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ అధ్యక్షతన  సమావేశమయిన  రాష్ట్ర మంత్రి మండలి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది.
1.జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను. సంతృప్త స్ధాయిలోఅమలు చేస్తారు.  ఎస్సీ,ఎస్టీతో పాటు బీసీ,కాపు, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగులకు వర్తిస్తుంది. ఈసారి బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్,ఎంఫార్మసీ, ఎంబీయే, ఎంసీయే,బీఈడీ లాంటి కోర్సులకూ పూర్తి స్ధాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.
ఇక జగనన్న వసతి దీవెన కింద ఏడాదికి భోజన,వసతి కోసం ఆర్ధిక సహాయం అందిస్తారు.ఐటిఐ చదవుకుంటున్న వారికి ఏడాదికి రూ.10వేలు, పాలిటెక్నిక్‌ చదువుతున్న వారికి ఏడాదికి రూ.15వేలు.డిగ్రీ ఆ పై చదువులు చదువుతున్న వారికి ఏడాదికి రూ.20వేలు ఇచ్చేందుకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది.
అర్హుడైన ప్రతి విద్యార్ధికి వసతి, భోజన సదుపాయాల కోసం జగనన్న వసతి దీవెన కింద ఈ నగదు చెల్లింపు చేస్తారు.
విద్యార్థుల వసతికోసం గతంలో రూ.500 కోట్లు ఖర్చు చేస్తారు. ఈ సారి జగనన్న వసతి దీవెన కింద ఏటా రూ.2300 కోట్లు  అందిస్తారు.  జగనన్న విద్యా దీవెనకోసం ఏటా రూ.3400 కోట్లు ఖర్చవుతాయి.  గతంలో రూ.1800 కోట్లు మాత్రమే కేటాయించారు.
జగనన్న విద్యాదీవెన, జగనన్న విద్యా వసతి రెండు పథకాల కోసం రూ.5700 కోట్లు ఖర్చు చేస్తారు. ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్య 11,44,490.నిబంధనల సడలింపు కారణంగా మరింత పెరగనున్న లబ్దిదారుల సంఖ్య .జగనన్న విద్యాదీవెన, జగనన్న విద్యావసతి పథకాలకోసం నిబంధనలను భారీగా సడలించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు సంవత్సరాదాయ పరిమితి రూ.2 లక్షలు, మిగతా వాళ్లకి లక్షలోపు ఆదాయం ఉంటేనే ఫీజు రియింబర్స్‌మెంట్‌ వర్తిస్తుందనేది గత నిబంధన కాగా,
తాజాగా ప్రభుత్వం రూ.2.5లక్షల లోపు వార్షికాదాయం ఉన్న అందరికీ జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా వసతి పథకాలు వర్తిస్తాయని పేర్కొంది.
10 ఎకరాలలోపు మాగాణి గాని లేదా, 25 ఎకరాల్లోపు మెట్టభూమి ఉన్న వారికీ, లేదా రెండూ కలిపి 25 ఎకరాల్లోపు ఉన్నవారికి వర్తిస్తుందంటూ నిబంధనలు సడలించింది.
ఆదాయంతో సంబంధం లేకుండా పారిశుధ్ద్యకార్మిక ఉద్యోగులున్న కుటుంబాల్లోని వారికీ ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది.
కారు మినహా ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్‌ ఉన్నవారు అర్హులేనని తాజా నిబంధనల్లో ప్రభుత్వం పేర్కొంది.
ఆదాయపుపన్ను కట్టేవారిని అనర్హులుగా స్పష్టం చేస్తోంది.
పట్టణాల్లో 1500 స్క్వేర్‌ ఫీట్‌ స్థిరాస్థి ఉన్నవారికీ వర్తిస్తుందని ప్రభుత్వం తాజా నిబంధనల్లో స్పష్టం చేసింది.
పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ, ఆపై కోర్సులను ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, అనుబంధ, విశ్వవిద్యాలయాలు, బోర్డుల్లో చదువుతున్న విద్యార్ధులందరికీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
2. వైయస్సార్‌ కాపు నేస్తం  కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కాపు,బలిజ,తెలగ,ఒంటరి, ఉప కులాలకు ఆర్ధిక సహాయం
45–60 ఏళ్ల మధ్యనున్న మహిళలకు ఏడాదికి రూ.15వేలు చొప్పున ఐదేళ్లలో రూ.75వేలు ఆర్ధిక సహాయం
వారి జీవనప్రమాణాలను పెంచి, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడానికే ఈ ఆర్ధిక సహాయం చేస్తున్నామన్న మంత్రిమండలి. కాపునేస్తం కోసం ఈ యేడాది రూ.1101 కోట్లు కేటాయింపు
ప్రతీయేటా రూ.900 కోట్లు ఖర్చవుతుందని అంచనా
కాపుల సంక్షేమం కోసం ఏడాదికి మొత్తంగా రూ.2వేల కోట్లు కేటాయింపు
3. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌
కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, సంబంధిత అంశాలపై మంత్రులబృందం(జీఓఎం) కు సలహాలు, సూచనల కోసం అధికారుల బృందం ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
ప్రభుత్వ ప్రధానకార్యదర్శి అధ్యక్షతన అటవీ,పర్యావరణ, ఆరోగ్య, పంచాయితీరాజ్, పట్టణాభివృద్ధి, పాఠశాలవిద్యాశాఖ కార్యదర్శలు ఈ బృందంలో ఉంటారు. అధికారుల బృందానికి కన్వినర్‌గా వ్యవహరించనున్న ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి.
4. ట్రైబల్‌ కమ్యూనిటీ హెల్త్‌ లైజన్‌ వర్కర్స్‌ జీతాల పెంపుదల
ట్రైబల్‌ ప్రాంతాల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ లైజన్‌ వర్కర్ల జీతాలు రూ.400 నుంచి రూ.4000కు పెంపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
5. బియ్యం కొత్త కార్డుల జారీకి కేబినెట్‌ ఆమోదం
అర్హులైన వారందరికీ సంతృప్తస్థాయిలో బియ్యం కార్డులు జారీ
బియ్యంకార్డుల జారీకోసం నిబంధనలను సడలించిన ప్రభుత్వం. 2008 తర్వాత అర్హతలను మళ్లీ సమీక్షించలేదని, సమీక్ష చేయాలంటూ ప్రభుత్వానికి ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి చేశారు. గతంలో రేషన్‌ ఇవ్వాలంటే గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.5వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.6,250 ఆదాయం ఉన్నవారికే వర్తిస్తుందని నిబంధనలు పెట్టారు. తాజాగా ప్రభుత్వం దీన్ని సడలించింది. గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయం రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయం రూ.12 వేలు లోపు ఉన్నవారికి వర్తించేలా మార్పు చేశారు. గతంలో అర్హులై రేషన్‌ దక్కని వారినుంచి దరఖాస్తులు స్వీకరించి ప్రభుత్వం మళ్లీ కార్డులు జారీచేస్తుంది.
6. ఏపిఎస్‌డిసిఎల్‌ విభజన ఆంధ్రప్రదేశ్‌ సదరన్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ను రెండుగా విభజించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీన్ని ఆంధ్రప్రదేశ్‌ సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీగానూ, ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలిమిటెడ్‌గా విభజన జరుగుతుంది.
7. ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా బ్యాంకుల నుంచి రుణాల స్వీకరణకు కేబినెట్‌ ఆమోదం
8. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకానికి కేబినెట్‌ ఆమోదం
వచ్చే ఉగాదినాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి.
సంతృప్త స్థాయిలో అర్హుల ఎంపిక చేయాలి.కులం, వర్గం, రాజకీయాలతో సంబంధం లేకుండా వివక్షకు తావులేకుండా, పారదర్శక విధానంలో లబ్ధిదారుల ఎంపిక
9.విశాఖ జిల్లా పరవాడ మండలం తాడి గ్రామంలో ఏపీఐఐసీకి 50 ఎకరాల భూమి కేటాయింపు. పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణకోసం భూమి కేటాయింపు
10. నడికుడి – శ్రీకాళహస్తి బ్రాడ్‌ గేజ్‌ లైన్‌ నిర్మాణంకోసం ద.మ. రైల్వేకు 92.05 ఎకరాల భూమి కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం
11. ఏపీ ఎక్సైజ్‌ యాక్ట్‌లో సవరణలు సంబంధించి ముసాయిదా బిల్లులకు కేబినెట్‌ ఆమోదం.వీటిని రానున్న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
మద్యం ధరలను పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం
12. కడప స్టీల్‌ ప్లాంట్‌ : కడప స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. డిసెంబర్‌ 26న స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన జరుగుతుంది.జమ్మల మడుగు మండలం సున్నపురాళ్ల పల్లి మరియు పెద్ద నందలూరు గ్రామాల మధ్య శంకుస్థాపన ఉంటుంది. దీనికోసం ఏపీ హై గ్రేడ్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తారు.
స్టీల్‌ ప్లాంట్‌కోసం 3295 ఎకరాల భూమి సేకరిస్తారు.ఇనుప ఖనిజం సరఫరాకు ఎన్‌ఎండీసీతో ఒప్పందం చేసుకుంటారు.
13. ఆంధ్రప్రదేశ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ పరిధిలోకి ఇంటర్‌ విద్యను చేర్చుతూ ముసాయిదా బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
14. తిరుమల తిరుపతి దేవస్ధానం బోర్డులో సభ్యుల సంఖ్యను 19 నుంచి 29 కి పెంచుతూ దేవాదాయశాఖ చట్టంలో సవరణలు కోసం తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం
15. షెడ్యూల్ట్‌ కేస్ట్, షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌కు వేర్వేరుగా కమిషన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ నిర్ణయం. ఏపి స్టేట్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ కేస్ట్‌ అండ్‌ షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ యాక్ట్‌ సవరణకు కేబినెట్‌ ఆమోదం.వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వేర్వేకు కమిషన్ల ఏర్పాటుకు బిల్లు తీసుకువస్తారు.