Home Breaking మంత్రివర్గ విస్తరణపై సీఎం జగన్ కీలక నిర్ణయం

మంత్రివర్గ విస్తరణపై సీఎం జగన్ కీలక నిర్ణయం

413
0
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి తన క్యాబినెట్ సహచరుల ఎంపికపై కసరత్తును పూర్తి చేసినట్టు పార్టీ వర్గాల నుండి సమాచారం. జూన్‌ 8న ఉదయం 9.15 గంటలకు మంత్రివర్గ విస్తరణను చేస్తారని తెలుస్తోంది. ముఖ్యమంత్రితో సహా 26 మందికి మంత్రి వర్గంలో చోటుదక్కే అవకాశం కనిపిస్తోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలతో సహా మరో 12 జిల్లాలు ఏర్పాటు చేయాలని, ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి ఒక జిల్లాను చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు అంతర్గతవర్గాలు తెలుపుతున్నాయి. ప్రతి జిల్లాలోనూ ఒక మంత్రి ప్రాతినిథ్యం వహించేలా ఈ మంత్రివర్గ కూర్పు జరుగుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తన కేబినెట్‌లో అనుభవానికి, యువతరానికి అవకాశం ఇవ్వడం ద్వారా మంత్రివర్గంలో సమతుల్యం ఉండేలా జగన్‌ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. గురువారం ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాక వీలయినంత త్వరగా క్యాబినెట్ ను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆలోచించినప్పటికీ, మంచి ముహూర్తం కోసం వేచి ఉండాల్సి వచ్చింది.
ఈ నెల 8వ తేదీన ముహూర్తం కుదరడంతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని జగన్‌ నిర్ణయించారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. సచివాలయం సమీపంలోనే మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి తగు ఏర్పాట్లను చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం… మంత్రులుగా పరిశీలనలో ఉన్న నాయకులు వీరే…
ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం)
ధర్మాన కృష్ణదాస్‌ (నరసన్నపేట)
కళావతి (పాలకొండ)
రెడ్డి శాంతి (పాతపట్నం)
బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి)
కోలగట్ల వీరభద్రస్వామి (విజయనగరం)
పుష్పశ్రీవాణి (కురుపాం)
రాజన్నదొర (సాలూరు)
గుడివాడ అమరనాథ్‌ (అనకాపల్లి)
గొల్ల బాబూరావు (పాయకరావుపేట)
ముత్యాలనాయుడు (మాడుగుల)
ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ (తూర్పు గోదావరి జిల్లా)
కురసాల కన్నబాబు (కాకినాడ రూరల్‌)
దాడిశెట్టి రాజా (తుని)
ఆళ్ల నాని (ఏలూరు)
తెల్లం బాలరాజు (పోలవరం)
తానేటి వనిత (కొవ్వూరు)
గ్రంథి శ్రీనివాస్‌ (భీమవరం)
కొడాలి నాని (గుడివాడ)
పేర్ని నాని (మచిలీపట్నం)
సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట)
కొలుసు పార్థసారథి (పెనమలూరు)
మేకా వెంకట ప్రతాప అప్పారావు (నూజివీడు)
గుంటూరు జిల్లా: మర్రి రాజశేఖర్‌ (ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని పాదయాత్రలో జగన్‌ హామీ ఇచ్చారు)
ఆళ్ల రామకృష్ణారెడ్డి (మంగళగిరి)
అంబటి రాంబాబు (సత్తెనపల్లి)
బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు)
ఆదిమూలపు సురేశ్‌ (యర్రగొండపాలెం)
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు)
భూమన కరుణాకర్‌రెడ్డి (తిరుపతి)
మేకపాటి గౌతంరెడ్డి (ఆత్మకూరు)
రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డి (కావలి)
ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి)
కడప జిల్లా: గడికోట
శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి)
అంజాద్‌బాషా (కడప)
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (డోన్‌)
శ్రీదేవి (పత్తికొండ)
హఫీజ్‌ఖాన్‌ (కర్నూలు)
అనంత వెంకటరామిరెడ్డి (అనంత అర్బన్‌)
కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం)
ఎం.శంకరనారాయణ (పెనుకొండ).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here