అన్నింటా మహిళలకే మొదటి ప్రాధాన్యం, ఇదే జగన్ ఫిలాసఫీ: మేకతోటి సుచరిత

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళాకేంద్రంగా అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ ఉంది,ఇలాదేశం లో విమెన్ సెంట్రిక్ ప్రభుత్వం ఏదయిన ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వాన్నే ముందు చెప్పుకోవాలని హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు.
ఈ రోజు ఆమె విలేకరులతో మాట్టాడుతూ రాష్ట్ర ప్రభుత్వం  సాధిస్తున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.మహిళలకు ప్రాధాన్యమిచ్చే జగన్ తరహా పరిపాలన మొదలయిందని, ఇందులో ఎన్నికలను హామీల అమలుకు ప్రాధాన్యం ఉంటుందని చెబుతూ  ఈ వాస్తవాన్ని చంద్రబాబు భరించలేకపోతున్నారని ఆమె విమర్శించారు.
Mekathoti Sucharita
 ఇాలా వినూత్న ధోరణులతో ఎన్నికల ప్రణాళికను అమలు చేస్తున్నందునన ఆరునెల్లలోనే  మేటి ముఖ్యమంత్రుల్లో జగన్ ఒకరయ్యారుని, ఎందరో సీనియర్ ముఖ్యమంత్రులున్నా ఈ గౌరవం జగన్ దక్కడానికి కారణం  రాష్ట్రంలో సాగుతున్న పరిపాలన తీరే నని ఆయన అన్నారు.
వాగ్దానం చేసినట్టే తొందర్లో  డ్వాక్రా మహిళల రుణాలన్నీ నాలుగు విడతలుగా రద్దు చేస్తున్నట్లు సుచరిత ప్రకటించారు.  ఆ హామీని కూడా త్వరలో నెరవేర్చబోతున్నారు. ఈ మేరకు చారిత్రాత్మక ప్రకటన వెలువుడుతుందని ఆమె వెల్లడించారు.
 ‘ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి  అమలు చేస్తున్న పథకాలు, వాటిల్లో మహిళలకు దక్కుతున్న వాటా చూసి మహిళలంతా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలు బాగు పడుతుంటే.. మహిళలు అభివృద్ధి చెందుతుంటే, మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తుంటే.. ప్రతిపక్షానికి ఎందుకు కడుపు మంటగా ఉంది,’అని ఆమె వ్యాఖ్యానించారు.
‘గతంలో మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతి మహిళా లక్షాధికారి కావాలని, పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు. ఇపుడ ఈ నినాదాని మరింత ముందుకు తీసుకుపోతున్నాం.ఈ వరసలోనే పథకాలను అమలు చేస్తున్నారు.  ‘అమ్మఒడి’ నుంచి  ‘చేయూత’ వరకూ ప్రతి పథకం మహిళలు, తల్లులకే ప్రాధాన్యత ఇచ్చేందుకు కారణం, అభివృద్ధిని మహిళలకు అంకితం చేయడం కోసంమే. ప్రతి కుటుంబంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఫలాలు  మహిళ చేతుల మీదుగా అందాలని జగన్ తాపత్రయం,’అని ఆమెఅన్నారు.
 నిన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు ప్రారంభించిన చేయూత పథకం ద్వారా దాదాపు 23 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారు. మహిళలు ఆర్థికంగా స్థిరపడటానికి ప్రభుత్వం ఈ చేయూత కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.  అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఈ ప్రభుత్వం అన్ని వర్గాల పేదలకు ముఖ్యంగా మహిళలకు ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తుంటే దేశం యావత్తూ గమనిస్తూ ఉంది. ఒక్క ప్రతిపక్షానికే ఇది కనిపించడం లేదు, అని ఆమె అన్నారు.
ఆమె ఇంకా ఏన్నారంటే…
 చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టిన మొదటి సంతకాలనే ఐదేళ్ళ వరకూ అమలు చేయలేకపోయారు. చంద్రబాబు ఎన్నికల హామీగా.. డ్వాక్రా రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పి.. బ్యాంకుల్లో కుదవ పెట్టిన మహిళల బంగారాన్ని ఇంటికే తెచ్చి ఇస్తానని మాటలు చెప్పి మహిళలను దారుణంగా మోసం చేశారు. ఎన్నికలకు రెండు నెలల ముందు పసుపు-కుంకుమ పేరుతో మళ్ళీ ఏ విధంగా మోసం చేశారో రాష్ట్ర ప్రజలంతా చూశారు.
2. ఆరు నెలల కాలంలోనే మంచి ముఖ్యమంత్రిగా ప్రజల చేత అనిపించుకుంటానని  బాధ్యతలు స్వీకరిస్తున్న రోజునే  జగన్ మోహన్ రెడ్డి  చెప్పారో… ఈరోజు రాష్ట్రంలోని పేదలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం కష్టకాలంలోనూ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న గొప్ప సీఎంగా పేరుతెచ్చుకున్నారు.   భారతదేశంలో ఎంతో మంది సీనియర్ ముఖ్యమంత్రులు ఉన్నా.. తాజా సర్వేల్లోనూ బెస్ట్ సీఎంగా జగన్ మోహన్ రెడ్డిగారు దేశంలో మూడో స్థానంలో ఉన్నారు.
3. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి.. కరోనా కష్టకాలంలోనూ రూ. 1400 కోట్లు ఇచ్చాం..
4. మహిళలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఉన్నతి సాధించినప్పుడే.. మహిళా సాధికారత సాధ్యం అవుతుందనేది జగన్ నమ్ముతున్న ఫిలాసీఫి. అందుకే మహిళలు కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేయాలని, పాడిపరిశ్రమలు, కోళ్ళ పరిశ్రమలు.. పెట్టుకుని వారి కుటుంబాలను అభివృద్ధి చేసుకోవాలని ఈ ప్రభుత్వం మనస్పూర్తిగా కోరుకుంటోంది.
దురదృష్టం ఏంటంటే.. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న ప్రతిపక్షం తమ పార్టీ ఉనికి, తమ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని పనిగట్టుకుని  ప్రభుత్వ పథకాలను అడుగడుగునా అడ్డుకోవాలని చూస్తున్నారు, ప్రజలు దానిని తిప్పికొట్టాలని ఆమె కోరారు.