Home Breaking మూడు రాజధానుల ముచ్చటైన రాష్ట్రం : జగన్

మూడు రాజధానుల ముచ్చటైన రాష్ట్రం : జగన్

147
0
రాజధానిపై చర్చ లో  ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచన
మొట్టమొదట సారిగా ముఖ్యమంత్రి జగన్ రాజధాని గురించి పెదవి విప్పారు. అమరావతి భవితవ్యం గురించి ఆయన ఇంతవరకు మాట్లాడలేదు. మంత్రులే మాట్లాడారు. అందుకే రాజధాని మీద రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఇపుడు తొలిసారిగా ఆయన అసెంబ్లీ చర్చలో స్పష్టత ఇచ్చారు. రాజధాని వికేంద్రీకరణ గురించి మాట్లాడారు. చిన్న రాజధానుల గురించి చెప్పారు. రాజధాని నిర్మాణం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో తోయారాదని అన్నారు. అమరావతి తో పాటు కర్నూల్, విశాఖ రాజధాని కావొచ్చు అన్నారు.
జగన్ ఈ రోజు సభలో ఏమన్నారో చూడండి.
– గత ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని డిసైడ్ చేశారు.. ఆయన లెక్క ప్రకారం 53వేల ఎకరాల్లో కట్టాలంటే.. ఎకరాకు మౌలిక సదుపాయాల కోసం రెండు కోట్ల రూపాయలు చొప్పున ఖర్చు అయితే.. మొత్తం లక్షా 9 వేల కోట్లు అని తేల్చాడు.
– అయితే గత 5 ఏళ్ళలో రూ. 5,800 కోట్లు మాత్రమే చంద్రబాబు ఖర్చు పెట్టాడు
– రాజధాని బాండ్స్ పేరుతో 10.35 శాతం వడ్డీకి అప్పులు తెచ్చారు
– ఇప్పటి వరకూ రాజధాని పేరుతో తెచ్చిన అప్పులకు దాదాపు వడ్డీనే రూ. 700 కోట్లు ప్రతి ఏటా కట్టాలి
– రాజధానిలో ఇప్పటివరకూ 5 వేల కోట్లు ఖర్చు పెడితే.. మిగతా లక్ష కోట్ల డబ్బులు ఎక్కడ నుంచి తేవాలి. వాటికి వడ్డీ ఎంత అవుతుంది. వడ్డీ అయినా కట్టే పరిస్థితి ఉందా..
– నాకు కూడా కట్టాలనే ఉంది. కానీ, లక్ష కోట్లు ఎక్కడ నుంచి తేవాలి.. ఎక్కడ ఖర్చు పెట్టాలి అనే ఆలోచన ఉంది
– పోలవరం ప్రాజెక్టు నుంచి బొల్లాపల్లిలో రిజర్వాయర్ కట్టి.. దాని ద్వారా పులిచింతల నింపడం.. రాయలసీమలోని బనకచర్లకు నీళ్ళు తెచ్చే భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం రూ. 55 వేల నుంచి 60 వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా.
– ఈరోడు భారీ వర్షాలు పడినా.. వరదలు వచ్చినా.. రాయలసీమలో డ్యామ్ లు నిండలేదు. రాయలసీమలో డ్యామ్ లు నింపాలంటే ప్రాజెక్టుల కోసం రూ. 23 వేల కోట్లు కావాలి.
– రాష్ట్రంలో తాగడానికి డ్రింకింగ్ వాటర్ లేని పరిస్థితి. గోదావరి జిల్లాల్లో కూడా కలుషితమైన నీరు తాగుతున్నారు.
– పోలవరం, ధవళేశ్వరం నుంచి తాగు నీటి ని తీసుకు రావాలంటే.. గోదావరిలోనే ఒక్కొక్క జిల్లాకు రూ. 4 వేల కోట్లు కావాలి.
– రాష్ట్రవ్యాప్తంగా తాగు నీటి కోసం రూ. 40 వేల కోట్లు కావాలి
– మరోవైపు నాడు- నేడు కార్యక్రమం కింద.. శిధిలావస్థలో ఉన్న స్కూళ్ళు, ఆసుపత్రులు అభివృద్ధి చేస్తున్నాం.
– స్కూళ్ళ బాగు కోసమే రూ. 14 వేల కోట్లు కావాలి
– ఆసుపత్రులు బాగు చేయడం కోసం రూ. 30 వేల కోట్లు కావాలి.
– రాజధానిలో కేవలం 20 కిలో మీటర్ల పరిధిలో.. లక్ష కోట్లో.. రూ. 3 లక్షల కోట్లో.. నాలుగు లక్షల కోట్లో ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది.
– భవిష్యత్తు కోసం.. మనం వేసే ప్రతి అడుగూ ఆలోచన చేసే వేయాలి
– సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చెప్పినట్టు.. డీ సెంట్రలైజ్ అనేది నిజమైన కాన్సెప్ట్.. సౌత్ ఆఫ్రికా లో మూడు క్యాపిటల్ లు ఉన్నాయి
-ఇందులో భాగంగనే..
– విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావచ్చు , కర్నూలులో హైకోర్టు.. జ్యుడీషియల్ క్యాపిటల్ రావచ్చు, ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ కు బహుశా మూడు క్యాపిటల్ వస్తాయేమో. ..
– విశాఖలో మెట్రో రైలు వేస్తే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా సరిపోతుంది. ఇటువంటి ఆలోచనలు చేయడానికే కమిటీలు వేశాం. కొద్ది రోజుల్లో కమిటీ నివేదిక వస్తుంది.
– అధ్యయనం కోసం.. మొత్తం మూడు సంస్థలకు అప్పగించాం.
– ఆ సంస్థలు సుదీర్ఘంగా ఆలోచన చేసి.. నివేదిక ఇచ్చాక.. మంచి నిర్ణయం తీసుకుంటాం. మన పిల్లల భవిష్యత్తు కోసం మంచి నిర్ణయం తీసుకోవాలి.