అమరావతి కేసులో ప్రభత్వం తరఫున ఫేస్ బుక్ లాయర్, ఖర్చు 5 కోట్లు

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని హైకోర్టు దాఖలయిన కేసును వాదించే రాష్ట్ర ప్రభత్వం చాలా గట్టి న్యాయవాదిని, ఖరీదైన సీనియర్ న్యాయవాదిని నియమించుకుంది. ఆయన పేరు ముకుల్ రోహత్గీ.
సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది. అంతేకాదు గతంలో అటార్నీ జనరల్ గా కూడా పనిచేశారు. అనుమానం లేదు, ఢిల్లీ లోపేరున్న రాజ్యంగ న్యాయవాదుల్లో మేటి వర్గానికి చెందిన వారు రోహత్గీ. ఆయన ఫీజు కూడా అలాగే ఉంటుంది. ఈకేసులు వాదించేందుకు అయిదు కోట్లు రుపాలయను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.ఇందులో రోహత్గీకి ఒక కోటి రుపాయలు అడ్వాన్స్ గా చెల్లిస్తున్నది.
ఈ మేరకు జివొ (G.O.MS.No.1 )ను ప్లానింగ్ డిపార్ట్ మెంటు విడుదల చేసింది.రోహత్గీ ఇపుడు ఫేస్ బుక్ వాట్సాప్ ల న్యాయవాదిగా పనిచేస్తున్నారు. యూజర్ల మెసేజ్ లను డక్రిప్ట్ చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థలు   ఈ రెండు సోషల్  మీడియా వేదిక లమీద కేసు వేశాయి. ఇందులో ఫేస్ బుక్, వాట్సాప్ తరఫున రోహత్గీ వాదిస్తున్నారు.
అంతేకాదు, ముఖ్యమంత్రి జగన్ కు రోహత్గీ కొత్త కాదు. ఆయన మీద ఉన్న అక్రమార్జన కేసులలో 2011 లో సుప్రీంకోర్టులో వాదించిన ఇద్దరు న్యాయవాదులలో రోహత్గీ ఒకరు.మరొకరు రామ్ జేత్మలానీ. ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలమేరకు జగన్ ఆక్రమార్జనల మీద సిబిఐ చేత దర్యాప్తుచేపట్టిన సంగతి తెలిసిందే. ఈ  హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.అయితే, తాము హైకోర్టునిర్ణయాలలో జోక్యం చేసుకోలేమని చెబుతూ జగన్ అక్రమార్జనల మీద హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేయవచ్చని సుప్రీంకోర్టు ఆదేశించింది.ఇపుడు ప్రతిశుక్రవారం జగన్ నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరువుతున్నది ఈ కేసు కోసమే.
అమరావతి రాజధానిగా కొనసాగాలని వేసిన పిటిషన్ ను హైకోర్టువిచారణకుస్వీకరించినందున గట్టి లాయర్ ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ ను కోరింది. క్యాపిటల్ ను మూడు భాగలుగా వికేంద్రీకరించాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థించేందుకు రోహత్గీ యోగ్యుడని ప్రభుత్వం భావించింది. అందువల్ల ఆయనకు అడ్వాన్సుగా కోటి రుపయాలువిడుద లచేయాలని జివొ జారీ చేసింది. జివొ మీద ప్లానింగ్ ఎక్స్ అఫీసియో సెక్రెటరీ విజయకుమార్ సంతకం చేశారు.