మీడియా పీక నొక్కే జివొ జారీ చేసిన ఆంధ్ర ప్రభుత్వం

నిరాధారమయిన వార్తలేస్తే పత్రికలను, చానెళ్లను కోర్టు కీడ్చే అధికారాలను డిపార్ట్ మెంట్ కార్యదర్శులకు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివొ జారీ చేసింది.
గత క్యాబినెట్ లో  మీడియా మెడలు ఎలా వంచాలనే దాని మీద చర్చ జరిపిన సంగతి తెలిసిందే. నిరాధారమయిన వార్తలు రాస్తే ఇక ముందు  ఆయ శాఖల అధిపతులంతా  పత్రికల మీద, జర్నలిస్టుల మీద కేసుల పెట్టేఅధికారాన్ని ఇవ్వాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. ఇపుడు వివరంగా దీని మీద ప్రభుత్వం ఉత్తర్వులు జారీ  చేశారు.
 నిజానికి వార్తలు నిరాధారమయినపుడు ప్రభుత్వాధికారులు దీనికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసేందుకు ఇప్పటికీ మార్గముంది. ప్రెస్ కౌన్సిల్ ఫిర్యాదు చేయవచ్చు.సవరణలు కోరవచ్చు.
అయితే,ఏకంగా ప్రభుత్వాధికారులు పత్రికలను కోర్టుకీడ్చాలనుకోవడమే విచిత్రం. తనకేవో పత్రికలు నచ్చడం లేదని, మొత్తం మీడియా మీద ఆంక్షలు విధించడం సబబుకాదు. తొలిసారి ముఖ్యమంత్రిఅయిన జగన్  ఇలాంటి చర్య తీసుకుంటాడని ఎవరూ అనుకోలేదు.
పత్రికలకు రకరకాల సోర్సెస్ నుంచి సమాచారం అందుతూ ఉంటుంది.  అందులో కొంత వూహాగానం ఉండవచ్చు, నిజం ఉండవచ్చు, అర్థ నిజం ఉండవచ్చు. ఒక్కొక్క సారి రాసిన వార్త తప్పుకూడా కావచ్చు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునిప్రభుత్వం తీసుకోబోతున్న ఒక చర్య గురించి, ఎవరిద్వారానో తెలుసుకుని ప్రజలను హచ్చరించడమనేది మీడియా లో ఎపుడూ జరుగుతున్నదే. ఒక్కొక్క సారి రాసిన వార్త తప్పు కావచ్చు. ఇంతమాత్రాన నిరాధారమయిన వార్త రాశాడని  కేసులు పెట్టాలని అధికారుల మీద ఇలా జివొ ద్వార వత్తి డి తీసుకురావడం విపత్కర పరిణామం.
ఈ జివొ ప్రకారం, నిరాధారమైన వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా, సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసినా ఆ  వ్యక్తుల మీద, సంస్థల మీద ఈ జివొ ప్రకారం  చర్యలు తీసుకో వచ్చు.
 ఇలా  న్యాయపరంగా కేసులు దాఖలు చేసేందుకు అధికారులకు పవర్ వచ్చింది.
అయితే, జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను అన్ని రాజకీయ పార్టీలు గర్హిస్తున్నాయి. ఈ జివొని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
మీడియా స్వేచ్ఛకు సంకెళ్ళు వేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.  ‘ప్రజాస్వామ్య మూల స్తంభాలలో మీడియా ఒకటి. ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలను, విధానాలను ప్రశ్నించే కలాలను, గొంతులను కట్టడి చేస్తున్న ఈ చర్యను ఖండిస్తున్నాం. ఈ ఉత్తర్వును తక్షణం రద్దు చేయాలి.’ అని ఒకప్రకటనలో కోరారు.

ఫోటో సోర్స్ :punjabtoday