Home Breaking ఆందోళన వద్దు, హితులకు ఆంధ్రా ఐపిఎస్ అధికారి సలహా

ఆందోళన వద్దు, హితులకు ఆంధ్రా ఐపిఎస్ అధికారి సలహా

98
0
రాష్ట్ర ప్రభుత్వం తననని సస్పెండు చేసినందున ఆందోళనచెందాల్సిన పనిలేదని ఆంధ్ర ప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆలూరు బాల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
‘‘బంధుమిత్రులను హితులను ఉద్దేశించి…
రాష్ట్ర ప్రభుత్వం నన్న సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల కబురు మీ వరకు చేరే ఉంటుంది. మీడియాలో వస్తున్న కథనాలలో వాస్తవం లేదని మీరందరకుచెప్పడమే ఈ ప్రకటన ఉద్దేశం. దీని వల్ల మానసికంగా నాకు వచ్చిన ఇబ్బందేమీ లేదు కాబట్టి మీరేవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఈ చర్యను ఎదుర్కొనేందుకు చట్టపరంగా నాకున్న అవకాశాలను పరిశీలిస్తున్నాను, తదపరి చర్య ఏమిటనేది క్రమంగా మీకే తెలుస్తుంది..’’ అని ఆయన సంతకంతో ప్రకటన విడుదల చేశారు.