ఇంటర్నెట్ బంద్ తో ఇండియాకు రు.9200 కోట్ల నష్టం

గొడవలు, సమ్మెలు నిరసన ప్రదర్శనలు జరిగినపుడల్లా భారతదేశంలో ప్రభుత్వం చేసే మొదటి పని ఇంటర్నెట్ మూసేయడం. ఈ విషయంలో ఇండియ  ప్రపంచంలోనెంబర్ వన్.  ఇండియాపక్కనున్నదేశాలేమిటో తెలుసా, సూడాన్ , ఇరాక్. ఇదీ మన కంపెనీ. నిజానికి, కమ్యూనిస్టు దేశాలయిన చైనా, ఉత్తర కొరియాలలో కూడా  ఇంతగా ఇంటర్నెట్ ని అక్కడి ప్రభుత్వాలు రద్దు చేయడం లేదు. ఇంటర్నెట్ ఒపెన్ సొసైటీ కోసం పనిచేసే యాక్సెస్ నౌ అనే సంస్థ నివేదిక ప్రకారం 159 రోజుల పాటు ఒక దేశం ఇంటర్నెట్ బంద్ చేయడం అనేది ప్రపంచంలో భారత్ లో తప్ప మరొక చోట్ జరగనేలేదు. కాశ్మీర్ లో ఆగస్టు 5 నుంచి ఇంటర్నెట్ బంద్ కొనసాగుతూ ఉంది. ఇలాగే సిఎఎ వ్యతిరేక నిరసన ప్రదర్శనలు జరిగినపుడల్లా ప్రభుత్వం ఇంటర్నెట్ పలునగరాలలో బంద్ చేసింది. ఇలా దేశవ్యాపితంగా ఇంటర్నెట్ బంద్ కావడం వల్ల  భారతదేశంలో వ్యాపారం బాగా దెబ్బతినింది. 2019లో ఇలా ఇంటర్నెట్ పదే పదే మూసేసినందున   1.3 బిలియన్ డాలర్లు (రు.9200 కోట్లు) నష్టపోయింది. ఈ విషయాన్ని Top10VPN.com అనే సంస్థ వెల్లడించింది.

ఈ సంస్థ లెక్కల ప్రకారం భారతదేశంలో 2019లో మొత్తంగా 4,196 గంటల పాటు ఇంటర్నెట్ బంద్ అయింది. ప్రపంచ వ్యాపితంగా 18000 గంటలు బంద్ అయింది. ఇంటర్నెట్ బంద్ అయినందు వల్ల వ్యాపార వాణిజ్యాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ ఈ సంస్థ ‘Global Cost of Internet Shutdown in 2019’ పేరుతో ఒక నివేదిక విడుదల చేసింది. భారతదేశంలో ఎక్కడా లేనంతగా ఇంటర్నెట్ ను బంద్ చేసిందని,అధికారికంగా 100 సార్లు ఇంటర్నెట్  బంద్ చేసిందని ఈ నివేదికలో పేర్కొన్నారు. భారతదేశంలో సిఎఎ వ్యతిరేక ప్రదర్శనలు చెలరేగినపుడు, అయోధ్యతీర్పు సందర్బంగా గొడవలు చెలరేగుతాయోమోననే అనుమానంతోనూ  ఇంటర్నెట్ ను బంద్ చేశారని ఈ నివేదికలోని ఇండియా చాప్టర్ లో పేర్కొన్నారు. ప్రపంచవ్యాపితంగా వాణిజ్యానికి నష్టం 8బిలియన్ డాలర్లు.

ఇంటర్నెట్ మూసేయడంలో ప్రపంచంలో ఇండియాయే నెంబర్ 1

అయితే, ఇంటర్నెట్ ను ఇలా బంద్ చేయడం ప్రాథమిక హక్కులకు భంగం కల్గించడమే నని నిన్న సుప్రీంకోర్టు       ధర్మాసనం తీర్చుచెప్పిన సంగతి తెలిసిందే.  కాశ్మీర్  లో విధించిన ఇంటర్నెట్ ఆంక్షల మీద తీర్పు చెబుతూ ఇంటర్నెట్ ఇపుడు ఉద్యోగ స్వేఛ్చలో భాగంగా మయిందని, ఇంటర్నెట్ ప్రాథమిక హక్కు అవుతుందని  దీనికి రాజ్యంగంలోని ఆర్టికిల్ 19(1)(ఎ),  (1)(జి) కింద ప్రొటెక్షన్ ఉందని చెబుతూ ఇంటర్నెట్ ను బంద్ చేస్తూ కాశ్మీర్ లో  జారీ చేసిన ఉత్తర్వులును సమీక్షించాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

https://trendingtelugunews.com/telugu/breaking/supreme-court-says-internet-is-fundamendal-right/