పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకించండి : గ్లోబల్ సిఇవొలకు ఇండియన్ టెకీల లేఖ

భారతదేశంలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకత చెలరేగుతున్న సమమయంలో అమెరికాలో భారతీయ సంతతికి చెందిన పలువురు టెకీలు చట్టాన్ని వ్యతిరేకిస్తూ గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, ఫేస్ బుక్,భారతీయఎయిర్ టెల్, ఫ్లిప్ కార్ట్, ఉబర్, జియో  వంటి అంతర్జాతీయ కంపెనీల సిఇవొ లకు  లేఖలు రాశారు. మీరు కూడా ఈ దారుణమయిన చట్టాన్ని వ్యతిరేకించాలని వారు ఈసిఇవొ లను కోరారు.  వారు ఉత్తరాలు రాసిన వారిలో సుందర్ పిచాయ్, సత్య నాదెళ్లు, ముఖేష్ అంబానీలు లున్నారు.
ఇదే విధంగా భారత దేశంలో చీటికి మాటికి ఇంటర్నెట్ మూసేయడాన్ని కూడా వ్యతిరేకించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ మధ్య ప్రపంచంలో ఇంటర్నెట్ ను రెగ్యులర్ కట్టేస్తున్నదేశంగా భారత్ కు అపకీర్తి వచ్చింది. చైనా, ఉత్తర్ కొరియా వంటి ఏక పార్టీ నియంతృత్వాలలో కూడా ఇంటర్నెట్ ను రద్దు చేయడంలేదు. అయితే, భారతదేశంలో ఇది సాధారనమయిపోయింది.
టెక్ అగెన్స్ట్ ఫాసిజం (TechAgainstFacism) పేరుతో భారతదేశానికి, భారతీయ సంతతికి చెందిన టెకీలు ఈ లేఖనువిడుదల చేశారు. ఈలేఖను మీడియం (Medium) ప్రచురించింది. ఈ లేఖ మీద సంతకాలు చేసిన వారిలో టెకీలలొ ఇంజనీర్లు, రిసెర్చర్లు, ఎనలిస్టలు,డిజైనర్లు ఉన్నారు.
“The Act is political and electoral towards building a ‘Hindu Rashtra’ while excluding persecuted Tamil Muslims from Sri Lanka, Ahmadiyya and Hazara Muslims from Afghanistan and Pakistan, and Rohingya Muslims from Myanmar. The state of Kashmir is under siege, with leaders, activists and journalists gagged and placed under house arrest. The state of Assam is under lockdown and unrest, rendering 1.9 million people as stateless and ‘illegal’ after the imposition of NRC. Religion has never served as a prerequisite for Indian citizenship. Such actions are unconstitutional and act against the very citizens of the country that the government is under oath to serve,” అని వారు లేఖలో పేర్కొన్నారు.
భారత ప్రభుత్వం నిరసన తెలుపుతున్న వారి మీద ఎలా  హింస ప్రయోగిస్తున్నదో వారు అంతర్జాతీయ కంపెనీల దృష్టికి తీసుకువచ్చారు.
“We refuse to silently witness the violence unleashed on Indians. We also call upon technology leaders like Sundar Pichai (Alphabet), Satya Nadella (Microsoft), Mark Zuckerberg (Facebook), Jack Dorsey (Twitter), Dara Khosrowshahi (Uber), Mukesh Ambani (Jio), Gopal Vittal (Bharti Airtel), Kalyan Krishnamurthy (Flipkart), and Shantanu Narayen (Adobe) to take a stance and publicly denounce the fascist acts by the Indian government,” అని వారు విజ్ఞప్తి చేశారు.