మోడీ గ్రాఫ్ పడిపోయింది : బీజేపీని హెచ్చరిస్తోన్న సంచలన సర్వే

నెల రోజుల్లోనే ఎన్డీయే బలహీన పడింది, యుపిఎ బలం పుంజుకుంది అనడానికి తాజా సర్వే నిదర్శనం. ఇదే సర్వే మార్చ్ లో ఎన్డీయేకి 280 సీట్లు వస్తాయని చెప్పింది. ఇప్పుడు ఆ లెక్క మారింది. ఎన్డీయే కైవసం చేసుకోబోయే సీట్ల సంఖ్య నెల రోజుల వ్యవధిలోనే తగ్గినట్టు ఈ సర్వే తేల్చింది. ఇంతకీ ఆ సర్వే ఏంటి? బీజేపీకి ఎన్ని సీట్లు దక్కనున్నాయి? కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో గెలవనుంది? రాష్ట్రాల వారీగా జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఎన్ని సీట్లు దక్కించుకోనున్నాయి? ఈ వివరాలు తెలియాలంటే కింద ఉన్న సమాచారం చదవండి.
ఇండియా టీవీ-సిఎన్ఎక్స్ నిర్వహించిన సర్వేలో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. గత నెలలో వీరి సర్వే ఎన్డీయే 280 సీట్లు దక్కించుకుంటుంది అని చెప్పింది. కానీ తాజాగా నిర్వహించిన సర్వేలో ఎన్డీయే గ్రాఫ్ తగ్గిపోయింది. 275 స్థానాల్లో గెలవనున్నట్టు వెల్లడించింది. ఇది ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన 272 స్థానాలకు అదనంగా 3 సీట్ల స్వల్ప ఆధిక్యం. ఇందులో బీజేపీ వాటా 230 సీట్లు. కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ 147 సీట్లు సాధించనున్నట్టు వెల్లడించింది. గత ఎన్నికల్లో 44 సీట్లు సంపాదించిన కాంగ్రెస్ బలం పుంజుకుని 97 కి చేరుకోనుంది. ఇక ఇతర పక్షాలు, స్వతంత్రులు 121 స్థానాల్లో గెలవనున్నాయి అని పేర్కొంది.
రాష్ట్రాల వారీగా ఏయే పార్టీలు ఎన్ని లోక్ సభ స్థానాలు గెలవనున్నాయంటే…
ఉత్తర్ ప్రదేశ్: బీజేపీ 40, బీఎస్పీ 16, ఎస్పీ 18, కాంగ్రెస్ 4, ఆర్ఎల్డి 1, అప్నా దళ్ 1
ఉత్తరాఖండ్ : బీజేపీ 3, కాంగ్రెస్ 2
రాజస్థాన్ : బీజేపీ 17, కాంగ్రెస్ 8
వెస్ట్ బెంగాల్ : తృణమూల్ కాంగ్రెస్ 28, బీజేపీ 12, కాంగ్రెస్ 1, లెఫ్ట్ 1
ఒడిశా : బిజూ జనతా దళ్ 14, బీజేపీ 6, కాంగ్రెస్ 1
మధ్య ప్రదేశ్ : బీజేపీ 21, కాంగ్రెస్ 8
చ్చత్తీస్గఢ్: బీజేపీ 3, కాంగ్రెస్ 8
పంజాబ్ : కాంగ్రెస్ 9, అకాళీ దళ్ 2, ఆప్ 1, బీజేపీ 1
హర్యానా : బీజేపీ 9, కాంగ్రెస్ 1
బీహార్ : బీజేపీ 14, ఆర్ జె డి 8, జెడి(యు) 9, కాంగ్రెస్ 3, ఎల్ జె పి 3, ఆర్ ఎల్ ఎస్ పి 1, హమ్ 1, విప్ 1
ఝార్ఖండ్ : బీజేపీ 9, జేఎంఎం 2, కాంగ్రెస్ 3
గుజరాత్ : బీజేపీ 24, కాంగ్రెస్ 2
హిమాచల్ ప్రదేశ్: బీజేపీ 3, కాంగ్రెస్ 1
మహారాష్ట్ర : బీజేపీ 21, శివ సేన 13, కాంగ్రెస్ 7, ఎన్ సి పి 6, ఇతరులు 1
గోవా: బీజేపీ 2, కాంగ్రెస్ 0
తమిళనాడు : డీఎంకే 16, ఎఐఎడిఎంకె 10, కాంగ్రెస్ 5, బీజేపీ 1, పీఎంకే 2, ఇతరులు 5
ఆంధ్ర ప్రదేశ్ : వైసీపీ 18, టీడీపీ 7
తెలంగాణ : టీఆరెస్ 12, ఎంఐఎం 1, కాంగ్రెస్ 4
కర్ణాటక : బీజేపీ 16, కాంగ్రెస్ 10, జేడీ (ఎస్) 2
కేరళ : యూడీఫ్ 14, ఎల్ డి ఎఫ్ 5, బీజేపీ 1
జమ్మూ కాశ్మీర్ : బీజేపీ 2, ఎన్ సి 3, కాంగ్రెస్ 1
అస్సాం : బీజేపీ 5, ఏఐయూడీఫ్ 2, కాంగ్రెస్ 5, ఇతరులు 2
ఇతర పశ్చిమ తూర్పు రాష్ట్రాలు : బీజేపీ 4, కాంగ్రెస్ 4, ఎన్ పి పి 1, ఎన్ డి పి పి 1, ఎస్ డి ఎఫ్ 1
ఢిల్లీ : బీజేపీ 7
యూనియన్ టెర్రిటరీస్ : బీజేపీ 4, కాంగ్రెస్ 2

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/kodandaram-spews-fire-on-trs-party/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *