ఇంటర్నెట్ మూసేయడంలో ప్రపంచంలో ఇండియాయే నెంబర్ 1

ఇంటర్నెట్ ను బంద్ చేయడంలో ప్రపంచంలో ఇండియా టాప్ కొచ్చింది. ఆందోళనవల్ల భారత ప్రభుత్వ చాలా రెగ్యులర్ గా ఇంటర్నెట్ ను బంద్ చేస్తూ ఉంది.తాజాగా మొన్న గురురవారం నాడు ఢిల్లీ, ఇపుడు రాజస్థాన్ లోని కొన్ని నగరాలలో కేంద్రం మొబైల్ ఇంటర్నెట్ ను బంద్ చేసింది. సిటిజన్ షిప్ యాక్టకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళన వల్ల ప్రతి రోజూ ఏదో ఒక చోట ఇంటర్నెట్ బంద్ అవుతూ ఉంది.అంతకు ముందు కాశ్మీర్ లో ఇంటర్నెట్ లేకుండా నెలల తరబడి బంద్ (Internet shutdown) చేశారు. ఇంటర్నెట్ అడ్వొకెసీ గ్రూప్ యాక్సెస్ నౌ (Access Now) రిపోర్టు ప్రకారం 2018లో ప్రపంచవ్యాపితంగా ఇంటర్నెట్ బంద్ అయిన సందర్భాలలో 67 శాతం సార్లు భారతదేశంలోనే జరిగిందని ఎకనామిక్ టైమ్స్ రాసింది.
ఏదయినా ఆందోళన చెలరేగినపుడు ఆ వార్త ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా నివారించేందుకు భారత ప్రభుత్వం ఇంటర్నెట్ బంద్ చేసుంది.అపుడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు మొబైల్ ఇంటర్నెట్ నెట్ వర్క్ ను ఆఫ్ చేసేస్తారు. దీనిత మొబైల్ ఫోన్ లో ఇంటర్నెట్ బంద్ అవుతుంది.
ఆశ్చర్యమేమిటంటే బాగా వార్తల మీద బాగా సెన్సార్ ఉన్న చైనా, ఉత్తర కొరియా వంటి దేశాలలో ఇంతగా ఇంటర్నెట్ బంద్ చేయడం లేదని యాక్సెస్ నౌ రిపోర్టు చెబుతుంది. దీనికి కారణం అక్కడి వివరాలు అందకపోవడం కూడా కారణం కావచ్చు. జనవరి 2012 నుంచి ఇంతవరకు సాఫ్ట్ వేర్ ఫ్రీడమ్ అండ్ లా సెంటర్ (SFLC) ప్రకారం భారతదేశంలో 373 సందర్భాలలో ఇంటర్నెట్ బంద్ చేశారు.
ఇంటర్నెట్ బందయిన రాష్ట్రాలలో ఢిల్లీ, అస్సాం, త్రిపుర మేఘాలయ,అరుణాచల్ ప్రదేశ్ తో పాటు పశ్చిమ బెంగాల్, కర్నాటక, ఉత్తర ప్రదేశ్ లలోని కొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయి. వీటన్నింటికి రాజకీయ నిరసనలేకారణం. ఇక జమ్ము కాశ్మీర్ లో 2012 నుంచి ఇంతవరకు 180 సార్లు ఇంటర్నెట్ బంద్ అయింది.
ఇ-కామర్స్ మీద దెబ్బ వేసింది
అయితే, ఇలా చీటికి మాటికి ఇంటర్నెట్ బంద్ కావడం ఇ-కామర్స్ ను బాగా దెబ్బతీసింది.గత గురువారం నాడు అంటే డిసెంబర్ 19 ఢిల్లీలో ఇంటర్నెట్ బంద్ కావడంతో ఫుడ్ డెలివరీలు బాగా ఆలస్యమయి బిజినెస్ పడిపోయిందని, ఈశాన్య రాష్ట్రాలలో దీని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉందని ఒక ప్రముఖ ఈ కామర్స్ సంస్థ కు చెందిన ప్రతినిది ఎకనామిక్ టైమ్స్ కు తెలిపారు.