భారత దేశంలో కరోనా కేసుల పెరుగుదల ఏరోజుకారోజు ఒక రికార్డవుతూ ఉంది. గత 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 17,296 కరోనా పాజిటివ్ కేసులునమోదయ్యాయి. వీటితో మొత్తొ కేసుల సంఖ్య 4,90,401 అయింది. అయితే, కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా మెరుగుపడుతూ ఉండటం కొంత వూరటకలిగించే విషయం. ఇంతవరకు 58.24 శాతంమంది కోలుకున్నారు.జూన్ 25 నాటికి దేశంలో 77, 76,228 కరోనా పరీక్షలు నిర్వహించారు. గురువారం నాడు 2, 15, 446 శాంపిల్స్ ను పరీక్షించారు.
నిన్న దేశంలో 407 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 15,301 కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ బులెటీన్ విడుదలచేసింది. మరణాలలో 70 శాతం మంది ఇతర షుగర్, బిసి వంటి జబ్బులతో బాధపడుతున్నవారే నని కేంద్రం ప్రకటించింది.
