హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ దేవుళ్లకు నమస్కారం, సిటీని యునెస్కో రికార్డు కెక్కించింది వాళ్లే…

ఈ మధ్య హైదరాబాాద్ నగరమే పెద్ద  ఫుడ్ ప్లాజా అయిపోయింది. పొద్దున , సాయంకాలం హైదరాాబాద్ లో ని జంక్షన్ లన్నీ  ఫుడ్ ఫెస్టివల్ జరుపుకుటంటున్నట్లు కనపడతాయి. హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థలో ఫుడ్ వ్యాపారం అందునా నాన్ ఫార్మల్ గో రోడ్ల మీద జరిగే ఫుడ్ అమ్మకాలు చాలా పెద్ద వ్యాపారమయిపోయాయి. ఒక సర్వే ప్రకారం హైదరాబాద్ లోని మొత్తం వర్కింగ్ పాపులేషన్ లో 12 శాతం మంది ప్రత్యక్షంగారో పరోక్షంగా  ఈ రోడ్డమీది ఫుడ్ వ్యాపారంలోనే ఉపాధి పొందుతున్నారు.
హైదరాబాద్ కల్చర్ కు ఆహారానికి చాలా సంబంధాలున్నాయి. మొన్నమొన్నటి దాకా హైదరాబాద్ బిరియానీ, ఇరానీచాయ్, బన్ మస్కా, చోటావాల సమోసాల లో జాతీయకీర్తి నార్జించింది. ఇపుడు సిటి గ్లోబలైజ్ అయ్యాక హైదరాబాద్ ఆహార వైవిద్యం పెల్లుబికింది. తమాషా ఏమిటంటే, హైదరాబాద్ కొచ్చిన కొత్త ఆహారమేదయినా, చాలా తక్కువ కాలంలో హైదరాబాదీ గా మారిపోతుంది. అందుకే అదొక కొత్త రుచితో హైదరాబాాద్ లో స్థిరపడిపోయింది నగర ఆహారవైవద్యాన్ని సుపంపనం చేస్తున్నది. ఇదే హైదరాబాద్ నగరాన్ని యునెస్కో (UNESCO) ఆహారం క్యాటగరి (Gastronomy)లో  క్రియెటివ్ సిటీస్ నెట్ వర్క్ (Creative cities network) లోకి చేర్చింది.
ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఈ హైదరాబాద్ ఆహారవైవిధ్యం అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిపొందేందుకు కారణం, హైదరాబాది ఆహార ప్రియుడు. వెజిటేరియన్ కావచ్చు, నాన్ వెజెిటేరియన్ కావచ్చు, హైదరాబాద్ కొచ్చిన వాళ్లంతా ఆహార ప్రియులయిపోతారు.
ఈ మధ్య జిహెచ్ ఎంసి అధికారులు ఒక హైదరాబాద్ ఆహారం మీద ఒక చిన్న పాటి సర్వే చేశారు. హైదరాబాద్ రోజూ 700 టన్నుల చికెన్ , 291 టన్ను మాంసం భుజిస్తున్నారు.  పండగలపుడు చికెన్ డిమాండ్ 2000 టన్నులకు చేరుతుంది. ఈ సర్వే ఆధారంగానే  యునెస్కో హైదరాబాద్ ను క్రియెటివ్ సిటీస్ నెట్ వర్క్ లో చేరింది. జిహెచఎం సి అధికారులు నగరంలో రైల్వే స్టేషన్ల దగ్గిర, బస్టాండులలో, బస్టాపులలో, క్రాస్ రోడ్లో ఉండే బండ్లతో పాటు, సాయంకాలమో, రాత్రో, పొద్దునో వచ్చి మకాం వేసే తోపుడు బండ్లు దుకాణాలు,  రెండు మూడు గంటల కోసం వచ్చే ఇడ్లీ దోసే బండ్లు అన్ని కలిపితే హైదరాబాద్ లో లక్షన్నర  ఫుడ్ దుకాణాలున్నాయి. ఇవికాక లెక్కలేన్నవ టీ స్టాల్లున్నాయి.అంతేకాదు, ఈ వ్యాపారాలలో దాదాపు పదివేల మంది స్వయం ఉపాధి మహిళలు కూడా ఉన్నారని  ఈ సర్వేని ఉదహరిస్తూ ది హిందూ రాసింది.
హైదరాబాద్ లో మోడ్రన్ హోటల్స్ లో ఎలాగయితే ల్యాండ్ మార్క్స్ ఉన్నాయో, స్ట్రీట్ ఫుడ్ కు సంబంధించి కూడా లెక్కలేన్న చిన్నచిన్నబండ్లు దుకాణాలు పాపులర్ అయ్యాయి. ఇందులో గోకుల్ చాట్ వంటి చాట్ షాపులు, రామ్ కి బండి వండి దోసె హోటళ్లు, మయూర్ పాన్ మహల్ వంటి పాన్ షాపులున్నాయి.
ఇందులో మొజాంబాహి మార్కెట్ లోని  రామ్ కి బండి దోెసే హెటల్ కి చాలా పేరొచ్చింది. దీనికి కారణం ఇక్కడ  దోసే మీద రకరకాల ప్రయోగాలు విజయంతంగా చేయడమే. అన్ని చోట్ల దోసెలు గుండ్రంగా ఉంటే ఇంటే కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి. కొంచెం నీళ్లాలా ఉప్మావేసి దోసెను క్రిస్ప్ గా పళపళలాడే లా చేసి రుచ్చికట్టించిడం రామ్ కి బండి స్పాషాలిటీ. కట్ దోసే కూడా ఇక్కడే మొదలయిందని చెబుతారు. ఇకదోసే చీప్, పనీర్, టొమటోటాపింగ్ తో దోసేమీద చాట్ మసాలా కూడా చల్లి ఇక్కడి మాస్టర్లు పిజ్జా మీద ప్రయోగాలు చేసినట్లు చేశారు. వేరు శనగ చట్నీ, అల్లం చట్టీ, మసాల ఉండనే ఉంటాయి. ఐటి కంపెనీల ఉద్యోగస్తులు, సుదూర ప్రాంతాలకు రైళ్లల్లోవెళ్లే ఉద్యోగస్థులు,వ్యాపారులు విద్యార్తులు  మార్కెట్ల్ పనికొచ్చే వారు, అక్కడి బిజినెస్ సంస్థలలో పనిచేసేవాళ్లతో పొద్దున ఐదు నుంచి రామ్ కి బండి దోస కొసంఎదురు చూసే వారితో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడ వ్యాపారం  ఉదయం తొమ్మిదిగంటలకు, ట్రాఫిక్ వూపందుకునే సరికల్లా క్లోజవుతుంది.   1982లో కొమరయ్య అనే హైదరాబాది పెట్టిన ఈ దోసే బండి లో 45 మంది ఉద్యోగులున్నారు. ఇలాంటి బండ్లే హైదరాబాద్ ని మోస్టు లివబుల్ సిటీ గా చేశాయంటే ఆశ్చర్యం కాదు. హైదరాాబాద్ యునెస్కో రికార్డు కెక్కించింది కూడా ఫైవ్ స్టార్ హోటళ్లు కాదు, స్ట్రీట్ ఫుడ్ దేవుళ్లే…