FLASH కరోనా క్వారంటైన్ కేంద్రంగా హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం

కరోనా వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఒక స్టేడియనుం క్వారంటైన్ కేంద్రంగా ప్రకటించింది.
అనుమానితులను, పాజిటివ్ చేసులను  దూరంగా ఉంచేందుకు హైదరాబాద్ లోని  గచ్చిబౌలి స్టేడియంను క్వారం టైన్ కేంద్రంగా మార్చేందుకు ఏర్పాట్లు చేపట్టింది.
 స్టేడియంలోని అథ్లెటిక్ క్రీడా ప్రాంగణంలో గల పరిపాలన విభాగంతో పాటు అందుబాటులో ఉన్న గదులన్నింటిని  ఇసోలేషన్  వైరస్ నివారణ వార్డుల కింద మారుస్తున్నారు.
గచ్చిబౌలిలోని స్టేడియంను 50 పడకల క్వారంటైన్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

వైద్య ఆరోగ్య శాఖ అధికారుల తో పాటు జిహెచ్ఎంసీ అధికారులు స్టేడియంను పరిశీలించారు…
శేరిలింగంపల్లి సర్కిల్ 11 పారిశుద్ధ్య విభాగం సిబ్బంది స్టేడియంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు…
రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో గచ్చిబౌలి స్టేడియంను క్వారంటైన్ కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు…