ఈ సారి చేప ప్రసాదం పంపిణీ లేదు: బత్తిని హరనాథ్ గౌడ్

ప్రతి ఏటా మృగశిర కార్తి రోజున వేసే చేప ప్రసాదం ఈ సంవత్సరంవేయడం లేదని బత్తిని హరినాథ్ గౌడ్ ప్రకటించారు
కరోన వైరస్ రోజు రోజుకి విస్తరిస్తున్న తరుణం లో ఎప్పుడు పరిస్థితి అదుపులోకి వస్తుందో  చెప్పలేని పరిస్థితులున్నందున ఈ సారి చేప మందు పంపిణీ చేయడం సాధ్యం కావడం లేదని  ఆయన ఒక ప్రకటన చేశారు.
చేపమందును రోగులకు పంచేది హరినాథ్ గౌడ్ కుటంబసభ్యులే.
ఏటా దేశ విదేశాలనుంచి వేలాది మంది మా చేప మందుకోసం హైదరాబాద్ వస్తుంటారని.ఈ సంవత్సరం మాత్రం ఎవ్వరు రావద్దని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఈ నెల 29 తో ముగిసినా తరువాత పరిస్థితులను బట్టి జూన్ లో పొడిగించినా తాము మాత్రం ఈ సారి చేప ప్రసాదం పంపిణీ చేయడం లేదని స్పష్టం చేశారు. తమ పేరుతో ఎవరైనా చేప మందు ఇస్తామని ప్రకఠిస్తే ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని తక్షణం మాకు గానీ పోలీసు వారికి గాని తెలియచేయాలని బత్తిని హరనాథ్ గౌడ్ ప్రెస్ రిలీజ్ ద్వారా తెలిపారు.
“తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల వారు ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఏటా మాకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇతర స్వచ్ఛంద సంస్థలు, బద్రివిషాల్ పన్నాలాల్ పిట్టి ట్రస్ట్, అగ్రవాల్ సేవా సంగ్ సభ్యులు అందించే సహకారం ఎన్నడూ మరువలేనిది. వారందరికీ ఈ ప్రకటన ద్వారా మరియు ప్రత్యేకంగా ఈ సమాచారాన్ని తెలియచేస్తున్నాను,” అని హరినాథ్ గౌడ్ పేర్కొన్నారు.