హైదరాబాద్ కరొనా వైరస్ అప్ డేట్

తెలంగాణలోకి కరోనా ప్రవేశించకుండా ఉండేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమయిన చర్యలను తీసుకుంటూ ఉంది. ఇందులో ప్రధానమయినది ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తున్నవారిని వైరస్ కోసం స్రీనింగ్ చేయడం.
ఇప్పటి వరకు ఎయిర్ పోర్ట్ లో స్క్రినింగ్ హెల్త్ డెస్క్ ద్వారా 41102 మంది కి స్క్రినింగ్ చేశారు. ఒక్కరోజులో 3517 మందికి  స్క్రినింగ్ చేశారు.  అయితే కొంతమంది  స్వచ్చందంగా వచ్చి టెస్టులు చేయించుకుంటున్నారు. ఇలా ఇప్పటిదాకా  516 మంది స్రీనింగ్ చేయించుకున్నారు.
ఇప్పటివరకు 238 మంది ఇతర రాష్ట్రాల వారి  గాంధీ ఆసుపత్రిలో పరీక్షలకోసం క్యూకట్టారు. హైదరాబాద్ లోని గాంధీ,ఫీవర్ హాస్పిటల్స్ లో ఐసోలేషన్ లో ఉన్న వారి సంఖ్య 261 కు చేరింది.
ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నవారు 493 మంది. ఇప్పటి వరకు గాంధీతో 261 మందికి టెస్టులు చేశారు. టెస్టులు చేసిన వారిలో 239 మందికి నెగిటివ్ అని తేలింది.
తెలంగాణ లో పోసిటివ్ కేసు ఒకే ఒక్కటి కనిపించింది. ఈ సంఖ్య ఈ రోజు దాకా పెరగలేదు.  మరొక 11 మంది పరీక్షల ఫలితాలు రావలసిఉంది.