అమెరికాలో ఇండియన్ స్టూండెంట్స్ ఎంత మంది ఉన్నారో తెలుసా?

* అమెరికా విశ్వవిద్యాలయాలకు ఎక్కువ మంది విద్యార్థులను పంపి ఆదేశ ఆర్థిక వ్యవస్థకు భాారీగా నిధులందిస్తున్న దేశాలు మూడు: 1.చైనా 2. భారతదేశం 3. సౌత్ కొరియా.
* 1999/20 లో అమెరికా విద్యాసంస్థల్లో చేరిన మొత్తం విద్యార్థులు  1,075,496 మంది. గత అయిదేళ్లుగా అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థుల సంఖ్య  మిలియన్ కు పైబడే ఉంటున్నది.
* 1990-2020లో అడ్మిషన్ తీసుకున్న అంతర్జాతీయ విద్యార్థులు 2,67,712 మంది. ఇది అంతకు ముందు సంవత్సరం  కంటే కొద్దిగా (0.6శాతం)తక్కువ.
* అమెరికా వాణిజ్య శాఖ లెక్కల ప్రకారం 2019లో అంతర్జాతీయ విద్యార్థుల వల్ల అమెరికాకు 44 బిలియర్ డాలర్లు నిధులందాయి.ఇందులో చైనా వాట నెంబర్ వన్ స్థానంలో ఉంటే తర్వాతి స్థానాలు భారత్, సౌత్ కొరియావి.
* అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకువచ్చిన వీసా ఆంక్షల వల్ల అమెరికా వెళ్లాలనుకుంటున్న విద్యార్థులసంఖ్య తగ్గేందుకు కారణమయింది.
* ట్రంప్ విధానాల వల్ల అమెరికా విద్యార్థులనుపంపే 25 టాప్ దేశాలలో 19దేశాలనుంచి అడ్మిషన్లు తగ్గిపోయాయి.
* ఈ రోజుకు అమెరికాలో  చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు:అండర్  గ్రాజుయేట్ స్థాయిలో25,032 మంది; గ్రాజుయేట్ స్థాయిలో 85,160 మంది,  ఒటిపి (Optional Practical Training OTP) స్థాయిలో 81,173 మంది ఉన్నారు. 2019 నాటికి అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు 202,014. అంతకు ముందు మూడేళ్ల నుంచి ఈ సంఖ్య పెరుగుతూ వచ్చి ఈ స్థాయికి చేరిందని ఓపెన్ డోర్స్ (Open Doors Survey) సర్వే చెప్పింది.
* భారతీయ విద్యార్థుల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు $7.7 బిలియన్లు నిధులు అందాయి.
* ఇటీవలి కాలంలో అమెరికా ఎంబిఎ చదవాలనుకుంటున్న వారి సంఖ్య తగ్గింది. అయితే, మ్యాథ్స్, స్టాటిటిక్స్ చదవాలనుకునే వారి  సంఖ్య పెరిగింది.
* ఈ ఏడాది కరోనా పాండెమిక్ వల్ల అమెరికా లో అడ్మిషన్ తీసుకున్న ఇండియన విద్యార్థుల సంఖ్య 4.4 శాతం పడిపోయింది. అంతకు ముందు సంవత్సరం 2.9 శాతం పెరుగుదల చూపింది. భారతీయ విద్యార్థుల వలస 4.4 శాతం పడిపోవడం గతంలో ఎపుడూ జరగలేదు.
* కరోనా పాండెమిక్ వల్ల అమెరికా అంతర్జాతీయ విద్యార్థల అడ్మిషన్లు ఈ ఆగస్టులో 43 శాతం పడిపోయాయి. ఈ ఆగస్టులో ఒక దఫా అడ్మిషన్లు (Fall admissions) జరగాలి.
* ఓపెన్ డోర్స్ 2020 (Open Doors 2020) సర్వే   అమెరికా లో 700 క్యాంపస్ లలో అంతర్జాతీయ విద్యార్థుల అడ్మిషన్లను పరిశీలించింది. వీటిలో 2020  ఆగస్టు అడ్మిషన్ల కు సంబంధించి 90 శాతం క్యాంపస్ లు విదేశీ విద్యార్థుల అడ్మిషన్లు పడిపోయినట్లు వెల్లడించాయి. సుమారు 40 వేల మంది విద్యార్థులను తమ అడ్మిషన్లను వాయిదా వేసుకున్నారు.
* దీనితో అమెరికాలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 16 శాతం పడిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *