పెన్షన్ కోత మీద వివరణ కోరిన హైకోర్టు

తెలంగాణలో విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ లో 50 శాతం కోతపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ మొదలయింది. ఏ ప్రాతిపదికన పెన్షన్ లో కోత విధించారో వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
దేశ వ్యాపితంగా లాక్ డౌన్ అమలులో ఉన్నందున, ప్రభుత్వానికి నిధులు  వసూలు కాకపోవడం జీతాలలో కోత విధించాలని మార్చి 31న ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో సమావేశమయినఉన్నత స్థాయి అధికారుల కమిటీ నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం, ప్రజాప్రతినిధుల జీతాలలో 70 శాతం కోత విధించాలని, అఖిల భారత సర్వీసుఅధికారుల (ఐఎఎస్, ఐపిఎస్ ఐఎఫ్ ఎస్ వగైరా) జీతాలలో 60 శాతం, ఇతర ఉద్యోగుల జీతాలలో50 శాతం కోత విధించారు. అయితే, ఇందులోకి పెన్షనర్లను కూడా తీసుకువచ్చి పెన్షన్ లో 50 శాతం కోత విధించారు. దీనిని ప్రతిపక్షాలతో పాటుఅనేక వర్గాలు విమర్శించాయి. అనంతరం కోర్టులో కూడా ఈ నిర్ణయాన్ని సవాల్ చేశారు. ఇదే ఇపుడు హైకోర్టు పరిశీలనకు వచ్చింది.
విశ్రాంత ఉద్యోగుల ఫించనులో కోత విధించడం సమంజసం కాదని  హైకోర్టు అభిప్రాయపడింది. లాక్ డౌన్ సమయంలో పెన్షనర్లకు అనారోగ్య సమస్యలు వస్తే ఎవరు ఆదుకుంటారని హైకోర్టుప్రశ్నించింది.
పెన్షనర్ల విషయంలో ప్రభుత్వం దయ గా వ్యవహరించాలని హైకోర్టుసూచించింది.
పూర్తి పెన్షన్ ఇచ్చేలా సర్కారును ఒప్పించాలని  హైకోర్ట అడ్వకేట్ జనరల్ కు సూచించింది. కేసు అనంతరం విచారణ ఈనెల 24కి వాయిదా వేశారు.