అక్కన్నమాదన్న గుడి అమ్మవారు ఏనుగు అంబారీ యాత్రకి కోర్టు అనుమతి

హైదరాబాద్ వోల్డ్ సిటి హరిబౌలి అక్కన్నమాదన్న మహంకాళి గుడి బోనాల పండగ సందర్బంగా అమ్మవారిని  ఏనుగు అంబారీ పై సాగనంపే కార్యక్రమానికి మార్గం సుగమయింది. తెలంగాణ హైకోర్టు దీనికి అనుమతినిచ్చింది.
చారిత్రాత్మక అక్కన మాదన్న దేవాలయం ప్రతియేటా ప్రతిష్టాత్మకంగా అమ్మవారి అంబారీ యాత్ర నిర్వహిస్తుంది. .
1948 సంవత్స్రం నుండి ఇలా ఏనుగు పై అమ్మవారి ఘటాన్ని ఊరేగించడం ఒక ఆనవాయితీగా వస్తున్నది. అయితే, ఈ సంవత్సరం కరోనా వల్ల వచ్చిన ప్రభుత్వ ఆంక్షల కారణంగా ఆటంకం కలిగింది. వూరేగింపులకు అనుమతి రద్దు చేశారు.  అయితే, పూరీ జగన్నాథ రథయాత్రకు సుప్రీంకోర్టు అనుమతినీయడంతో అక్కన్నమాదన్న గుడి ట్రస్టు వాళ్లు కూడా హైకోర్టు లో పిటిషన్ వేసి పూరీ తరహాలోనే కరోనా నియమాలను పాటిస్తూ అంబారీ యాత్రకు అనుమతినీయాలని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ మీద హైకోర్టు సానుకూలంగా స్పందిస్తూ ఆదేశాలు జారీ చేసింది

 

https://trendingtelugunews.com/top-stories/breaking/akkanna-madanna-temple-file-petition-in-high-court-for-bonalu-procession/

 

https://trendingtelugunews.com/top-stories/breaking/ghatam-installed-at-hyderabad-old-city-akkanna-madanna-mahankali-temple/