హైదరాబాద్ లో వర్ష బీభత్సం, కరెంటు వైర్లతో జాగ్రత అంటున్న అధికారులు

 గ్రేటర్ హైదరాబాద్ నగరం లో కురిసిన భారీ వర్షం, భారీ గాలులకు విద్యుత్ తీగలపై చెట్లు కూలడంతో 50 విద్యుత్ స్తంభాలు విరిగాయి, 7 ట్రాన్స్ ఫార్మర్లు చెడిపోయాయని TSSPDCL సీఎండీ రఘుమా రెడ్డి తెలిపారు.
వర్షబీభత్సం నేపథ్యంలో  ఈ రాత్రి ఆయన సూ పెరింటెండింగ్ ఇంజినీర్లతో విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు.
భారీ వర్షం గాలుల వలన గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 27 నెం. 11 కేవీ ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా లో అంతరాయం కలిగిందని   జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గ్రీన్ ల్యాండ్స్ – బేగంపేట్, అమీర్ పెట్, ఎర్రగడ్డ, s.r. నగర్, మెహదీపట్నం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిందని ఆయన చెప్పారు.
రోడ్లపై, భవనాలపై తెగి పడ్డ తీగల విషయం లో అప్రమత్తం గా ఉండాలి, వాటిని తాకకుండా ప్రజలు  విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలని   రఘుమా రెడ్డి విజ్ఞప్తి చేశారు.
సరఫరా పునరుద్ధరణ పనుల్లో దాదాపు 100 మంది డిసాస్టర్ మానేజ్మెంట్ బృందాల ఇంజినీర్లు, సిబ్బంది, మరి కొద్ది సేపట్లో సాధారణ స్థాయికి విద్యుత్ సరఫరా అవుతుందని ఆయన చెప్పారు.
విద్యుత్ సరఫరా లో అంతరాయం కలిగితే  విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106,7382071574 లకు ఫిర్యాదు చేసి సంస్థకు సహకరించాలని ఆయన కోరారు.