వచ్చే మూడు రోజుల్లో ఆంధ్రలో భారీ వర్షాలు

ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
ఈశాన్య బంగాళాఖాతంలో రాగల రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
దీని ప్రభావంతో రాగల 3 రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు , పిడుగులు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్  విపత్తుల నిర్వహణ శాఖ  పేర్కొంది.
కృష్ణానది వరద ఉధృతి దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని,మత్స్యకారులు సముద్రంలోనికి వేటకు వెళ్ళరాద విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు హెచ్చరించారు.
రాగల 3 రోజులపాటు వాతావరణ వివరాలు:-
సెప్టెంబర్ 19వ తేది :- శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు.
మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు
సెప్టెంబర్ 20వ తేది:- శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు. మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం
సెప్టెంబర్ 21వ తేది:- శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా,కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు.
మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం