ఈ రోజు రేపు ఆంధ్రలో వానలే వానలు, పిడుగుల పడ్తాయ్ జాగ్రత్త

ఈ  రోజు రేపు ఉత్తరాంధ్ర,  కోస్తా జిల్లాలలో భారీ వర్షాలుకురిసే అవకాశం ఉంది.  ఈ మేరకు భారీ వర్ష సూచన విడుదలయింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతోంది. దీని ప్రభావంతో వచ్చే నాలుగురోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

 రాయలసీమ జిల్లాల్లో ఒక తేలికపాటి నుంచి ఒక మోస్తరు  వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రియల్ టైం గవర్నెన్స్  సొసైటీ వారు హెచ్చరిక విడుదల చేశారు.

 వారి సమాచారం ప్రకారం ఈ రోజు  గుంటూరు,  కృష్ణా,  ఉభయ గోదావరి జిల్లాలు,  విశాఖపట్నం,  విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో  భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు

నెల్లూరు,  ప్రకాశం,  కడప,  చిత్తూరు,  కర్నూలు,  అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి.

దీనితో వాగులు,  వంకలు,  నదుల్లో భారీగా వర్షపు నీరువచ్చే అవకాశాలున్నాయని అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు.

ప్రజలు వాగులు,  నదులు దాటకుండా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.

పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయయని , జనం జాగ్రత్త అని చెప్పారు.

టీ