ఈటెల రాజేందర్ ఒఎస్ డి కరోనా పాజటివ్, తెలంగాణలో నేటి కేసులు 237

తెలంగాణ ఆరోగ్య శాఖ  మంత్రి ఈటల రాజేందర్ టెక్నికల్ అడ్వయిజర్ డా. గంగాధర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది.  నిన్న మొన్న మంత్రితో కలసి ఆయన అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. తెలంగాణలో విఐపిలలోకరోనా ప్రవేశించింది. ఇప్పటికే  ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక మాజీ ఎమ్మెల్యే లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అంతేకాదు,  ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సహాయకుడికి కరోనా పాజిటివ్ అని  తేలడంతో  ఆయన హోం క్వారంటైన్ లో ఉంటున్నారు.
ఈ రోజు తెలంగాణలో అత్యధికంగా 237 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  ముఖ్యంగా 23  మంది జర్నలిస్టులు కూడా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. 140 మంది జర్నలిస్టులకు పరీక్షలు నిర్వహిస్తే  23 మంది పాజిటివ్అని తేలింది.
ఈ   రోజు నమోదయినకేసులలో జిహెచ్ ఎంసి నుంచి మొత్తం 195 కేసులున్నాయి. ఈరోజు మరణించిన వారు ముగ్గరు. దీనితో కరోనా రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 185 కు చేరుకుంది. తెలంగాణలో  ఇప్పటి వరకునమోదయిన కరోనా కేసులు 4974, డిశ్చార్జ్ అయిన వారు 2377. రాష్ట్రంలో ఉన్న యాక్టివ్ కేసులు 2412.