వైజాగ్ వంటి ప్రమాదాలు తెలంగాణలో జరగొద్దు: హరీష్ రావు హెచ్చరిక

పరిశ్రమలను ప్రారంభించేందుకు అనుమతులొచ్చినందున, ప్రారంభించే ముందుకు విజాగ్ గ్యాస్ లీక్ వంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని తెలంగాణ ఆర్థికమంత్రి టి హరీష్ రావు పరిశ్రమలకు సూచనలు చేశారు.
 ఆర్థిక మంత్రి హరీశ్ రావు.
కరోనా నేపధ్యంలో‌  అనుమతించిన పరిశ్రమలు ప్రారంభించేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో పారిశ్రామిక యాజమాన్యాలతో ఆయ సమీక్ష జరిపారు.
‘వైజాగ్  ఎల్ జి పాలిమర్స్ లో స్టైరీన్ గ్యాస్ లీక్  ఘటనలో 12 మంది చనిపోయిన  తర్వాత సంగారెడ్డి పరిశ్రమలలో ప్రమాదాలు జరిగి ముగ్గురు చనిపోయారు. ఏడాదిలో‌ సగటున 25 ,నుంచి‌ 30 మంది చనిపోతున్నారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, బాయిలర్ డిపార్ట్మెంట్ , పొల్యూషన్ అధికారులు సరిగా పని చేస్తే ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి? ఇండస్ట్రీ ఫ్రెండ్లీ అయినా‌‌ కార్మికులు, ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యం,’ అని చెప్పారు.  ఫ్యాక్టరీలు ఉన్న చోట ప్రజలు ఫిర్యాదు‌చేసేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం గ్రీవెన్స్‌ సెల్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
పాత పద్థతిలో పరిశ్రమలు నడపుతామంటే‌ కుదరదు.కొవిడ్ జాగ్రత్తలు తీసుకోకపోతే కార్మికుల మధ్య కోవిడ్ వేగంగా విస్తరిస్తుంది. కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.షిప్టు పద్దతి లో కార్మికులతో పని చేయించాలి. భౌతిక దూరం పాటిస్తూ కార్మికులు విధుల్లో పాల్గొనేలా చూడాలి.
కార్మికులకు మాస్క్ లు, శానిటైజర్లు తప్పనిసరిగా ‌అందుబాటులో ఉంచాలి.కోవిడ్ విషయంలో అలక్ష్యం వహిస్తే అధికారులు కఠినంగా వ్యవహరించాలి. కార్మికుల్లో ఒక్కరికి కరోనా సోకినా ఆ పరిశ్రమలో‌ ప్రొడక్షన్ ఆగిపోతుంది. పరిశ్రమను మూయాల్సి వస్తుంది.
పరిశ్రమల్లో పని చేసే‌ కార్మికులను తరలించే బస్సుల్లో‌ 50 మందిని తీసుకెళ్తున్నారు. సీట్‌కు ఇద్దరే ఉండాలి. వైజాగ్ లో గ్యాస్ లీక్ ప్రమాదం తర్వాత అప్రమత్తంగా ఉండాలని ఆరోజే కలెక్టర్ ను ఆదేశించా.
చాలా రోజులు పరిశ్రమలు మూతపడటం‌ వల్ల కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఇలాంటివి‌‌ జరగకుండా అన్ని చర్యలు చేపట్టాలి. బాయిలర్స్‌నిర్వహణ, ఫైర్ సేఫ్టీ, పొల్యూషన్ కంట్రోల్ వంటి ‌విషయాల్లో అధికారులు, పరిశ్రమ యజమానులు ఒకటికి రెండు‌‌సార్లు చెక్ చేసిన తర్వాతే ప్రారంభించాలి.
పర్యావరణ నిబంధనలు తప్పకుండా పాఠించాలి.కోవిడ్ నేపథ్యంలో కలెక్టర్ ఆధ్వర్యంలో కంట్రోల్ రూం పని చేస్తుంది. పరిశ్రమ యాజమాన్యాలకు సమస్యలుంటే 08455-272525 నెంబరు కు ఫోన్ చేయండి.
సమీక్ష లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, పరిశ్రమల శాఖ, పొల్యూషన్ , బాయిలర్స్ డిపార్ట్మెంట్ అధికారులు.