సారీ, దుబ్బాక ఓటమి కి బాధ్యత నాదే.. హరీష్ రావు

టి ఆర్ ఎస్ పార్టీ కి ఓటు వేసిన దుబ్బాక ప్రజల కు ధన్యవాదాలు చెబుతూనే అక్కడ పార్టీ భారతీయ జనతా పార్టీ చేతిలో ఓడిపోవడానికి తనదే బాధ్యత అని తెలంగాణ ఆర్థిక మంత్రి టి హరీష్ రావు ప్రకటించారు.టిఆర్ ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో జరిగిన ఈ ఉప ఎన్నికల ప్రచార బాధ్యతను ముఖ్యమంత్రి కెసిఆర్ మేనల్లుడు హరీష్ రావుకు అప్పగించిన సంగతి తెలిసిందే. అనూహ్యంగా ఈ ఎన్నికల్లో టిఆర్ ఎస్ బిజెపి చేతిలోఓడిపోయింది. మాజీ జర్నలిస్టు రఘునందన్ రావు గెలపొంది సంచలనం సృష్టించారు. సాాధారణంగా ఉప ఎన్నికల్లో రూలింగ్ పార్టీకే ప్రజలుమద్దుతిస్తారు. దుబ్బాక ఇది తిరగబడింది. టిఆర్ ఎస్ ఓడిపోయింది. దీనిని పర్యవసానాలు తీవ్రంగా వుండే అవకాశం ఉంది. దీని ప్రభావం వచ్చే గ్రేటర్ హైదరాాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పడే అవకాశం ఉంది. కాంగ్రెస్ స్థానాన్ని బిజెపి అక్రమించే సూచనలు కనిపిస్తున్నారు. ఈనేపథ్యంలో దుబ్బాకలో ప్రచారానికి బాధ్యతలు నిర్వర్తించిన మంత్రి హరీష్ రావు పార్టీ ఓటమికినైతిక బాధ్యత తీసుకున్నారు. ఈ నియోజకవర్గంతో కెసిఆర్ మ్యాజిక్ గాని, ఎమ్మెల్య హఠాన్మరణ సానుభూతి గాని టిఆర్ ఎస్ కు ఉపయోగపడకపోవడం ఆలోచించాల్సిన విషయమే. ఈ ఓటమిమీద హరీష్ రాావు చేసిన వ్యాఖ్యాలు:

ఎన్నికల్లో కష్ట పడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు..

దుబ్బాక ఓటమికి గల కారణాలు పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటాం.. మా లోపాలను సవరించు కుంటాం..

దుబ్బాక ప్రజా సేవలో నిరంతరం పాటు పడతాం అందుబాటులో ఉంటాం..

ఓటమి అయినప్పటికీ దుబ్బాక ప్రజల పక్షాన టి ఆర్ ఎస్ పార్టీ పక్షాన, నా పక్షాన కష్ట సుఖాల్లో ఉంటాం..

సీఎం కేసీఆర్ నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కి , ప్రజలకు , కార్యకర్తలకు , అన్నివిధాల సహాయ సహకారాలు ఇస్తూ , టి ఆర్ ఎస్ పార్టీ ఎప్పుడు కృషి చేస్తోంది..…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *