ప్రతి ఏడాది ఈస్కూల్లో ఐదో తరగతి ఉన్నట్లుండి మాయమవుతుంది…

ప్రాథమిక పాఠశాల అంటే ఒకటి నుంచి అయిదో తరగతి దాకా చదవుచెప్పే పాఠ శాల. కాని ఈ ప్రాథమిక పాఠశాలలో అయిదో తరగతి లేదు. విద్యార్థులు లేక కాదు, టీచర్ల లేక కాదు, క్లాసురూం లేక కాదు. అన్నీ ఉన్నాయి. టీచర్లకు జీతాలు అందుతున్నాయ్. అయినా విద్యార్థులంతా అయిదో తరగతికి వేరే చోటికి గర్వంగా వెళ్లి పోతారు. అదే రహస్యం. ఈ పాఠశాల గుంటూరు జిల్లాలో బోడేపూడివారిపాళెంలో ఉంది. పేరు ఆర్ సిఎం ప్రాథమికపాఠశాల. దేశంలో ఈ ఒక తరగతి గది ఎపుడూ ఖాళీ గా ఉండే స్కూల్ ఇదేనేమో.
అసలు విషయమేమిటంటే…
ఈ స్కూల్లో చాలా పెద్దదే. మొత్తం 376 మంది విద్యార్థులున్నారు. వీళ్లంతా నాలుగో తరగతి దాకా బాగా చదవుతారు. ఆతర్వాత మాయమవుతారు.
ఇక్కడి టీచర్లు ఈ పిల్లలందరికి మంచి శిక్షణ ఇచ్చి గురుకుల్ పరీక్షలు రాయిస్తారు. నాలుగోతరగతి పాసయి అయిదో తరగతి లోకి వస్తారో లేదా  విద్యార్థులంతా గురుకుల్ కు ఎంపికవుతున్నారు.
అయిదో తరగతికి వారంతా  ఇంకా మెరుగయిన వసతులున్న  గురుకుల్ పాఠశాలకు వెళ్లిపోతున్నారు. దీనితో స్కూల్లో ఐదో తరగతి చదివే విద్యార్థులు లేక తరగతి గది ఖాళీగా కనిపిస్తుంది.
గత పదేళ్లుగాఇదే పరిస్థితి కొనసాగుతున్నది. 201617 విద్యాసంవత్సరంలోఅయిదో తరగతిలో 63 మంది ఉండేవారు. వారిలో 61 మంది గురుకులపాఠశాలకు ఎంపికయ్యారు. అదే విధంగా 2017-18లో 79 మంది విద్యార్థులు ఐదో తరగతికి వచ్చారు. వారితో 79 మంది గురుకుల పాఠశాలకు ఎంపికయ్యారు. ఇక 2018-619లో అయిదో తరగతికి వచ్చిన 64 మంది గురుకుల పరీక్షలు రాస్తే మొత్తం ఎంపికయ్యారు. ఇంకేముంది ఐదోతరగతి ఖాళీ అయింది.
ఏదైనా సంవత్సరం ఒకరో ఇద్దరు పిల్లలు గురుకుల పాఠశాలకుఎంపిక కాలేక మిగిలిపోతే వారికి మాత్రం పాఠాలు చెప్పం కష్టమయి వారిని సమీపంంలోని ఏదో ఒక పాఠ శాలలో చేర్పిస్తుంటారు ఇక్కడి టీచర్లే.
ఇక్కడ టీచర్లు చాలా అంకిత భావంతో పనిచేస్తారని అనుకోవాలి. లేకండా క్లాస్ మొత్తం పోటీ పరీక్షకు సెలెక్ట్ కావడమమిటి?
గురుకుల పాఠశాల కు శిక్షణ నాలుగోతరగతి ప్రారంభంనుంచే మొదలుపెడతారు. శిక్షణకు అవసరమయిన పుస్తకాలు తెప్పించి, అదనపు తరగతులు నిర్వహించి, విద్యార్తులను తీర్చిదిద్దుతారు. ప్రధానోపాధ్యయుడి పర్యవేక్షనలో ఈ శిక్షణ కట్టుదిట్టంగా నడుస్తుంది. దీనితో పెద్ద ఎత్తున ఈ స్కూలు విద్యార్థులు గురుకుల పాఠశాలకు ఎంపికవుతున్నారు.
పాఠశాలకు ఆహ్లాదంగా చదువుకునే వాతావరం కూడా కల్పించారు. పూల మొక్కలతో చెట్లతో పచ్చని ఆవరణ తయారయింది. తరగతులు కూడా మ్యాపులు, చిత్రపటాలతో అందంగా నిజమయిన తరగతి గదిలాగా కనపిస్తాయి. ఆవరణలో దాతల సహకారంతోటైల్స్ వేయించారు, ఈ పాఠశాలకు పరిసరాలలో మంచిగుర్తింపు వుంది.