కోవిడ్ నియమాలు ఉల్లంఘించిన చంద్రబాబు: గుంటూరు లాయర్ కేసు

గుంటూరు నగరం అరండల్‌పేటలో నివాసం ఉంటున్న గేరా సుబ్బారావు s/o గేరా నాగయ్య  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరోనా ప్రొటొకోల్ ఉల్లంఘించి, గుంటూరు జనరల్ ఆసుపత్రి వద్ద జనం గుమికూడేలా చేసి ప్రజారోగ్యానికి  ముప్పు తెచ్నేలా ప్రవర్తించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గుంటూరు అర్బన్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు ఇచ్చిన ఫిర్యాదు ఇది.
“నేను 15సంవత్సరాలుగా న్యాయవాది వృత్తిలో ఉన్నాను. ఈరోజు (13/6/2020) నాకు తెలిసిన మిత్రులు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నేను వారిని పరామర్శించేందుకు సాయంత్రం జీజీహెచ్‌కు వెళ్ళగా అక్కడ రోడ్డును స్తంభింపజేసి గుంపులు గుంపులుగా జనం ఉండడం గమనించాను. కరోనా కల్లోల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధేశించిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ… బాధ్యతారాహిత్యంగా గౌరవ నారా చంద్రబాబునాయుడుగారు మందీ-మార్బలంతో, పెద్ద సమూహంతో వేలమంది రోగులు ఉండే గుంటూరు ప్రభుత్వాసుపత్రికి రావడం జరిగింది. 60సంవత్సరాలు దాటిన పెద్దలంతా ఇంటికే పరిమితం కావాలని పదే పదే నిబంధనలు హెచ్చరిస్తున్నా… 70సంవత్సరాల వయసుగల చంద్రబాబు గారు దాన్ని మీరడం, వందలాది మంది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో జీజీహెచ్ ఎదురుగల రోడ్డును స్తంభింపజేయడం, తదితర చర్యలతో ఆసుపత్రిలోని రోగులకే కాక సామాన్య ప్రజలకు సైతం ఇబ్బంది కలిగించారు. ఎక్కడా సామాజిక దూరం పాటించకుండా నిబంధనలు తుంగలో తొక్కారు. 14సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం రాష్ట్ర ప్రతిపక్ష నేతగా చంద్రబాబునాయుడు తనే స్వయంగా కోవిడ్ నియమాలను ఉల్లంఘించడం సమాజానికి చెడు సంకేతాలు ఇస్తుందని భావిస్తున్నాం. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన నేతలే ఇలా వ్యవహరించడం మంచి పద్ధతి కాదు. కావున దీనికి కారకులైన చంద్రబాబునాయుడుగారు ఆయనతో ఉన్న ఇతర నేతలపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము.”

గేరా సుబ్బారావు,న్యాయవాది, అరండల్‌పేట 11/3, 9705451397