గుజరాత్ లో ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు…

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల రగడ పతాక స్థాయికి చేరుకున్న సమయంలో గుజరాత్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికలు షెడ్యూలు ప్రకటించింది. ఎన్నికలు జరిపితే కొరోనా విజృంభిస్తుందా లేదా అని ఆంధ్రలో వచ్చిన వివాదం అక్కడ వచ్చినట్లు లేదు.  ఎన్నికలు  జరపవచ్చని కమిషన్ నిర్ణయించింది.

ఆరు మునిసిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 21 ఎన్నికలు జరుగుతాయి. 81 మునిసిపాలిటీలకు, 31 జిల్లా పరిషత్ లకు, 231తాలూకాపంచాయతీలకు ఫిబ్రవరి 28న ఎన్నికలు జరుగుతాయని గుజరాత్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.మునిసిపల్ కార్పొరేషన్ల ఎన్నికల కౌంటింగ్ ఫిబ్రవరి 23న, 81 మునిసిపాలిటీల,31 జిల్లా పంచాయతీల,231 తాలూకా పంచాయతీల  కౌంటింగ్ మార్చి2 న జరుగుతంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *