గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటివి?

దీపావళి అంటే సందడి. టపాకాయల, బాంబుల సందడి. ఇది లేని దీపావళిని వూహించలేం. ఇలాంటపుడు సడన్  గా గ్రీన్ దీపావళి క్యాంపెయిన్ మొదలయింది. గ్రీన్ అంటేనే ఉప్పుకారం లేని చప్పటి ఆహారం గుర్తు కొస్తుంది.గ్రీన్ వ్యవహారమంతా తేలిక బాపతు అనిపిస్తుంది.

ఇపుడు ఏకంగా దీపావళి , గ్రీన్ క్రాకర్స్ అంటున్నారు. గ్రీన్ క్రాకర్స్  నే అమ్మాలని  కాల్చాలని, అసలు పాతరకం టపాసులను తయారు చేయరాదనే క్యాంపెయిన్ మొదలయింది.

మామూలు క్రాకర్స్ ను నిషేధిస్తూ   సుప్రీంకోర్డు పోయిన తూరి తీర్పుచెప్పింది.  దీనితో కొంతమంది దీపావళి  ఇక కళ తగ్గుతుందని, సందడి తగ్గుతుందని ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గుడ్ న్యూస్, ఒక పేద విద్యార్థిని తలా వో చెయ్యేసి ఇలా ఫారిన్ పంపారు, ఇదొక కొత్త ప్రయోగం

టపాకాయలు రంగులు వెదజల్లాలని, బాగా సౌండ్ చేయాలనే ఉద్దేశంతో ఈ మధ్య వాటిలో ప్రమాదకరమయన రసాయనాలువాడటం మొదలయిది.వాటి మోతాదు పెచడం జరగుతూ ఉంది.

దీనితో వాటిని కాల్చినపుడు కాలుష్యకారక రసాయనాలు వెలువడతాయి. ఢిల్లీ వంటి నగరాలలో అసలే అలుముకుపోయిన పోల్యూషన్ కు ఇది కూడా తోడయిందని కొంతమంది  కోర్టుకెక్కారు.

కోర్టు శాస్త్ర విజ్ఞానాన్ని ఆధారం చేసుకుని కాలుష్యం కల్గించని గ్రీన్ టపాకాయలను వాాడాలని, అది నిమయమని చెప్పింది.

దీనితో గ్రీన్ టపాకాయల ఉత్పత్తి మొదలయంది.

ఇదింకా పుంజుకోలేదు. శివకాశి పాతరకం టపాకాయలు శకం ముగిసింది.

ఇంతకీ గ్రీన్ క్రాకర్స్, గ్రీన్ టపాకాయలంటే ఏమిటి?

గ్రీన్ టపాకాయలు కేవలం రంగుల వెలుతురు వెదజల్లి, శబ్దం చేయకుండా దీపావళిని చప్పగా,నిశబ్దంగా మారుస్తాయని, ఇక దీపావళి సందడి తగ్గిపోతుందనే అనుమానం చాలా మందిలో ఉంది. అది తప్పు.

గ్రీన్ క్రాకర్స్ కూడా పాత టపాకాయల్లాగానే 100-10 dBA సౌండ్ నే ఇస్తాయి. దీని గురించి అపోహలు వద్దు. గ్రీన్ టపాాకాయాల్లో ఇపుడు తయారీదారులు వాడుతున్నప్రమాదకర రసాయనాలను తీసేసి వాటి స్థానం లో ప్రమాద రహిత రసాయనాలు వాడతారు.అంతే తేడా.

మామూలు టపాకాయల్లో బేరియం నైట్రేట్ ( Ba(NO3)2 ). ని ఆక్సిడైజర్ గా  వాడతారు. టపాకాయల్లో దీనిని వాడటాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది. కారణం, బేరియం నైట్రేడ్ సురక్షితమయినది కాదు, పొల్యూషన్ కు కారణం ఇదే. ఇది విషం.

టపాకాయలనుంచి తెలుపు, ఆకుపచ్చరంగులొచ్చేందుకు దీనిని వాడతారు.

క్లోరిన్ డోనార్ కెమికల్స్ అందుబాటులో ఉన్నపుడు బేరియం నైట్రేట్ ఆకుపచ్చ కాంతి వెదజల్లుతుంది.

క్లోరిన్ లేకపోతే తెల్లటి కాంతి మిణుగురులిస్తుంది. అయితే, ఇది విడుదల చేసే పొల్యూషన్  హార్ట్ దగ్గిర నుంచి కిడ్నీ దాకా  శరీరంలో అని అవయవాల మీద దుష్ప్రభావం చూపిస్తుంది.

అందుకే దీన్ని నిషేదించాలని కొంత మంది ఢిల్లీ విద్యార్థులు తమ తల్లితండ్రుల ద్వార సుప్రీంకోర్టుకు వెళ్లారు.

నాగపూర్ కేంద్రంగా పనిచేసే నేషనల్ ఎన్విరాన్ మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (NEERI) పరిశోధకులు  బేరియం నైట్రేట్ కు ప్రత్యామ్నాయాలను కనుగొన్నారు.

దీనికి బదులు పొటాషియ్ నైట్రేట్ (KNO3), జియోలైట్ (అల్యూమినో సిలికేట్స్ ) వాడి క్రాకర్స్  తయారు చేశారు.

వీటికి తోడు ఫ్లవర్ పాంట్స్ లో నీళ్లు సున్నం మిశ్రమం కూడా నింపుతారు. దీనితో రంగు రంగుల పూలతో పాటు నీటి తేమ విడుదలయి ధూళిని, పొగను  చల్లబరుస్తుంది.  ఈ కాలుష్యం గాలిలో లేకుండా చేస్తుంది.

వీటిని వాడటం వల్ల 30శాతం పొల్యూషన్ తగ్గుతుందని ఈ సంస్థ చెబుతూన్నది.

గ్రీన్ క్రాకర్స్ లో  పొటాాషియమ్ నైట్రేట్ 32 శాతం,బఅల్యూమినియం పౌడర్ 40 శాతం, అల్యూమినియం చిప్స్ 11 శాతం, ప్రొప్రైటరీ యాడిటివ్స్ 17 శాతం వాడతారు. ఈ కాంబినేషన్ తో ఉన్నవాటిని STARZ అంటారు. ఈ  టపాసులు చాలా కాంతిని వెదజల్లుతాయి.

మరో రకం క్రాకర్స్ SWAS (శ్వాస్ ) అంటారు. ఇవి బాంబులు.  ఇందులో ప్రొప్రైటరీ యాడిటివ్స్ 72 శాతం, 16శాతం పొటిషియర్ నైట్రేట్, 9 శాతం అల్యూమినియమ్ పౌడర్, మూడు శాతం సల్ఫర్ వాడతారు. శబ్దం విషయంలో బేరియమ్ నైట్రేట్ టపాసులకేమీ ఇవి తీసిపోవని, అంతే సౌండ్ విడుదల చేసి బాంబ్ అనే పేరు నిలుపుకుంటాయని NEERI నిపుణులు చెబుతున్నారు.

ఈ రెండు రకాల టపాసులను కాల్చడం వల్ల సల్ఫర్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ విడుదల తగ్గిపోతుంది.

(ఫోటో:CSIR-NEERI వెబ్ సైట్)