మండుతున్నబంగారు, రు 50 వేల వైపు దూసుకుపోతున్న10 గ్రా. ధర

గోల్డ్ భగభగ మండుతూ ఉంది.  ఈ వారం అత్యధికంగా పదిగ్రాముల బంగారం ధర రు.48,589కి చేరింది. కనివిని ఎరుగని  రీతిలో పెరుగుతూ న్న బంగారం ధర  రు. 50 వేలకు చేరుకోబోతున్నది. అంతర్జాతీయంగా ఆర్థిక రంగం ఖాయిలా పడటం, కరోనా పాండెమిక్ పరిస్థితులు బంగారానికి అనుకూలించాయి. అయితే, మల్టీ కమోడటీ ఎక్సేంజ్ లో 0.02 శాతం తగ్గి రు 47,930 కి దిగింది. ఫూచ్చర్స కూడ  ఈ రోజు కొద్దిగా (0.1 శాతం) తగ్గి రు.48,075 దగ్గర నిలబడ్డాయి.
గురు వారం మధ్యాహ్నం పదిగ్రాముల బంగారం ధర రు.50వేల వైపు దూసుకుపోతున్నది. ఈమధ్యాహ్నం నిన్న మధ్యాహ్నం దేశంలో ని చాలా మార్కెట్లల్ యాభై వేల దరిదాపుల్లోకి దూసుకుపోయింది. కొన్ని రిటైల్ మార్కెట్లలోల పది గ్రాముల ధర యాభై పలికినట్లు సమాచారం అందింది. కలకత్తాలో రు.48,680 పలికితే, ఢిల్లీలో రు. 49,072 దాకా వెళ్లింది. ఈ ట్రెండ్ కొనసాగేలా ఉంది కాబట్టి రు.50 వేల రేటు పలికేందుకు ఎన్నోరోజులు పట్టదని ఇండియాన్ బులియన్ అండ్ జ్యులరీస్ అసోసియేషన్ వర్గాలు చెబుతున్నాయి.
ఇంటర్నేషన్  మార్కెట్ ధరలు ఇప్పటిలాగే పెరిగేతే అనతి కాలోంనే బంగారం ధర రు. 52 వేల నుంచి రు.55 వేల పెరగవచ్చని ఐబిజెఎ నేషనల్ ప్రెశిడెంట్  పృధ్విరాజ్ కొథారి టెలిగ్రాఫ్ కు చెప్పారు. డాలర్ కొద్దిగా బలహీన పడటం, కరోనా కంట్రోలయ్యే పరిస్థితి లేకపోవడంతో ఇన్వెస్టర్లు కన్ను గోల్డ్ మీద పడటం వల్ల ఇలా బంగారు మిళమిళలాడుతూ ఉందని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం గోల్డ్ ధర పెరిగింది. కరోనా తగ్గుతుందన్న ఆశ కనిపించకపోవడంతో గోల్డ్ ధర పెరిగేందుకు దోహదపడింది. స్పాట్ గోల్డ్  0.1శాతం పెరిగి ఔన్సు ధర 1,763.48 డాలర్లకు చేరింది. ఈ వారంలో ఒక దశలో ఈ ధర  1,779,06 డాలర్లకు కూడా చేరింది.
దీనితో బంగారు మీద రాబడి బాగా పెరుగుతూ ఉంది. గోల్డ్ మ్యూచ్యువల్ పండ్స్ మీద రాబడి  40.39 శాతానికి పెరిగింది. అంతర్జాతీయ వాతావరణం వల్లే ఇప్పుడు బంగారు ధర పెరుగుతూఉందనుకోలేం. బంగారు ధర ట్రాక్ రికార్డుచూస్తే పెరుగుదల నికరంగా సాగుతూ ఉంది. అంటే భవిష్యత్తు ఇన్వెస్టర్లకు బంగారు లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు.

* గోల్డ్ కొనాలనుకుంటున్నారా, ఇది గుర్తుంచుకోండి

ఎందుకంటే, గత దశాబ్దంగా బంగారు ధర పెరగుతూ ఉండటమే తప్ప తగ్గింది లేదు. అయితే,బంగారు భవిష్యత్తులో ఇంతగా మిళమిళ లాడక పోవచ్చనే వాళ్లు కూడా ఉన్నారు. క్యాష్ అందుబాటుల లేక చాలా మంది ఇపుడున్నధరలకు బంగారాన్ని అమ్మేసుకుంటున్నారు. అపుడు కొద్దిగా తగ్గే అవకాశం కూడా ఉందనేది వారి వాదన

Gold Facts : బంగారు గురించి మీకు ఈ 17 వాస్తవాలు తెలుసా?