దేశంలో ప్రథమం… CAA ని వ్యతిరేకిస్తూ జిహెచ్ ఎంసి తీర్మానం

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ  జిహెచ్ ఎం సి తీర్మానం చేసింది.ఇలా ఒక  మునిసిపల్ కార్పోరేషన్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తు కౌన్సిల్ తీర్మాణ చేయడం ఇంతవరకు ఎక్కడా జరగలేదు. ఇప్పటిదాకా కేవలం రాష్ట్రాల అసెంబ్లీలు మాత్రమే చట్టాన్ని వ్యతిరేకిస్తూ, రాష్ట్రంలో అమలుచేయలేమని తీర్మానలు చేశాయి. ఇపుడు గ్రేటర్ హైదరాబాద్  మునిసిపల్ కార్పొరేషన్ ఇలాంటి తీర్మానం చేసిరికార్డు సృష్టించింది.
శనివారం నాడు కౌన్సిల్  బడ్జెట్ సమావేశం నిర్వహించింది. సమావేశంలోప్రసంగిస్తూ సిఎఎ, ఎన్ ఆర్ సి లనువ్యతిరేకించాలని తొలుత ఎమ్ ఐఎమ్ సభ్యుడు మజీద్ హుసేన్ కోరారు. దీని మీద బిజెపి సభ్యుడు శంకర్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తర్వాత డిప్యూటీ మేయర్ ఫిసియుద్దీన్ తీర్మానం ప్రవేశపెట్టారు.  ఆసమయంలో బిజెపి సభ్యులు సభలో లేరు. తర్వాత తీర్మానంలో ఎన్ ఆర్ సి ని తొలిగించి సిఎఎకు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించారు.
తర్వాత కౌన్సిల్  2020-2021 సంవత్సరానికి రు.6973.64కోట్ల వార్షిక బడ్జెట్ ను ఆమోదించింది.