ఆంధ్రలో కరోనా మరణాలు 43, కొత్త కేసులు 1908

గత ఇరవై నాలుగు గంటలలో ఆంధ్రపదేశ్ లో కరోనా వల్ల 43  మంది చనిపోయారు. ఇంతమంది ఒకరోజున చనిపోవడం ఇదే మొదటిసారి.
మృతుల వివరాలు:  అనంతపురం జిల్లా నుంచి 10 మంది చనిపోయారు. ఇతర జిల్లాలలకు సంబంధించి పశ్చిమగోదావరి జిల్లా నుంచి 9, చిత్తూరు  జిల్లా నుంచి 5,  తూర్పుగోదావరి జిల్లా నుంచి 5, కడప 5, కర్నూల్ 3, ప్రకాశం 3, విశాఖ 2, విజయనగరం జిలా నుంచి ఒక్కరు మరణించారు.
దీనితో రాష్ట్రంలో మృతుల సంఖ్య 408కి చేరింది.
గత 24 గంటలలో రాష్ట్రంలో 1908 కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసులు 30,163 కు చేరితే యాక్టివ్ కేసులు 14,528 అయ్యాయి.  డిశ్చార్జయిన వారు 15, 227 మంది.
నిన్న ఒక్క రోజున చిత్తూరు జిల్లానుంచి 238కేసులు నమోదయ్యాయి. దీని తర్వాతి స్థానం శ్రీకాకుళం  215 కేసులు.  పశ్చిమగోదావరి  మూడోస్థానంలో ఉంది. అక్కడ నమోదయిన కేసులు 199. అనంతపురం జిల్లా 185 కేసులతోనాలుగో స్థానంలో ఉంది. అతితక్కువ కేసులు నమోదయింది ప్రకాశం జిల్లాలో (32).
జిల్లాల వారీగా వివరాలివి.