సౌరవ్ గంగూలీ గుండెపోటుతో చతికిలబడ్డ ఫార్చూన్ వంటనూనె

సెలెబ్రిటీలను చూపి మన ఆరోగ్యం గురించి ప్రకటనలు గుప్పించి మాయ చేసే అడ్వర్టయిజ్ మెంట్లు బోగస్ అని సౌరవ్ గంగూలీ గుండెపోటు రుజువు చేసింది

సౌరవ్ గంగూలీ గుండె జబ్బుతో ఆసుపత్రి లోచేరగానే తీవ్రమయిన షాక్ తినిందెవరనుకుంటున్నారు.  ఫార్చూన్ వంటనూనె.

అదాని గ్రూప్ తయారుచేసే ఫార్చూన్ రైస్ బ్రాన్ వంటనూనెకు మాజీ బిసిసిఐ ప్రెసిడెంట్ గంగూలి బ్రాండ్ ఎంబాసిడర్. ఫార్చూన్ రైస్ బ్రాన్ అయిల్ వంటలకు ఉపయోగిస్తూ మీ గుండె భద్రం, సురక్షితం, గుండెపోటు రాదని గంగూలి చిత్రం చూపి  ప్రకటనలు ఇస్తూ వస్తున్నారు.

సౌరవ్ ఈ ప్రకటనలను ఎండార్స్ చేస్తూ వస్తున్నారు. నాలుగు రోజుల కిందట సౌరవ్ గంగూలీకి గుండెపోటు రావడంతో ఫార్చూన్ రైస్ బ్రాన్ అయిల్ బాగా అభాసు పాలయింది. సోషల్ మీడియాలో జోకుల జోకలు విసిరారు. గంటల్లో ఈ ప్రకటనలు కంపెనీ ఉపసంహరించుకుంది.

వెంటనే  ఫార్చూన్ అయిల్ తో చేసిన వంటలు తింటే గుండె జబ్బు రాదని సౌరవ్ చిత్రాలతో ఉన్న అడ్వర్టయిజ్ మెంట్లన్నింటిని ఉపసంహరించుకుంది.

మైల్డ్  గుండెపోటు రావడంతో సౌరవ్ గంగూలీ కలకత్తా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

అదానీ గ్రూప్ ఫార్చూన్ వంటనూనె కోసం సౌరవ్ ఈ ఫిబ్రవరిలోనే రెండేళ్ల కాలానికి  అడ్వర్టయింట్ మెంట్ ఒప్పందం చేసుకున్నారు. ఫార్చూన్ రైస్ బ్రాన్ ఆయిల్ తోపాటు  ఇలాగే ఆరోగ్య ప్రకటనలతో పశ్చిమబెంగాల్ లో మార్కెట్ చేసేందుకు ఆవనూనె, సోయా నగెట్స్   కూడా అదానీగ్రూప్ సౌరవ్ ఒప్పందం కుదుర్చుకుంది.

ఫార్చూన్ రైస్ బ్రాన్ అయిల్ టివి ప్రకటనలను నిలిపివేసినా ఈ కంపెనీ మాత్రం ఇంకా గాంభీర్యం ప్రదర్శిస్తూనే ఉంది. ఇది తాత్కాలిక నిలుపుదల మాత్రమే, తొందర్లనో మళ్లీ సౌరవ్ తో దూసుకుపోతామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ లు చెబుతున్నారు.

ప్రపంచంలో ఆరోగ్యకరమయిన వంటనూనెల్లో రైస్ బ్రాన్ అయిల్ ఒకటి. ఇందులో న్యాచురల్ యాంటిఆక్సిడాంట్స్ ఉంటాయి. రైస్ బ్రాన్ లో ఉన్న గామా ఒరైజోనల్ శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్టరాల్ ని తగ్గిస్తుందని కంపెనీ అధికారుల బయోకెమిస్ట్రీ బోధిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *