సిబిఐ విచారణ విషయంలో వివక్ష, సిఎం జగన్ కు హర్షకుమార్ లేఖ

అయ్యా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు!
ఇది నా మొట్టమొదటి బహిరంగలేఖ .
దీనిలోని విషయాలు ఒక్కసారి చర్చించితే బాగుంటుంది అని మనవి చేసుకొంటున్నాను. బహుశా ఎవ్వరికీ ఇవ్వని results ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు ఇచ్చారు. సంతోషం.
ఒకవర్గం…. దళిత సామాజిక వర్గము మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంది.వాళ్ళందరూ మీ తరుపున గత ప్రభుత్వం మీద పోరాటం చేసిన వారే…..
1.మీరు తుని లో జరిగిన ఉద్యమము దాని తర్వాత జరిగిన పర్యవసానాలు కేస్ లు ఇవన్నీ ఆలోచించి కేస్ లను తీసేసారు.మంచిది. ఆ విషయాలన్ని క్షణిక ఆవేశంలో జరిగినవి కాబట్టి తీసి వేయడాన్ని కూడా స్వాగతిస్తున్నాము.
2.స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు మీ పిలుపు మేర రిలయన్స్ మార్ట్ లపై జరిగిన దాడులు కేస్ లు కూడా తీసివేశారు.సంతోషం.
3.అలాగే గరగపర్రు ఉద్యమము మొదలు కొని ఎన్నో ఉద్యమాలు దళితులు చేశారు.ఒక్క ఉద్యమములోని కేస్ లను కూడా మీరు రద్దు చేయలేదు.దళితులనే రద్దు చేయలేదా మరియొక కారణమోమాకు తెలియదు.
4a.మీరు గద్దె నెక్కినప్పటినుంచి అన్ని విషయాలలో దళితులకు అన్యాయము జరుగుతుంది.ఉదాహరణకు SC సబ్ ప్లాన్ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియదు…కానీ 15,789 కోట్లు ఖర్చుపెట్టామని ప్రకటన ఇచ్చారు.
4b. మీరు గద్దె నెక్కిన తర్వాత ఒక్కరికి కూడా ఎస్ సి కార్పొరేషన్ లోన్ ఇవ్వలేదు.
4c. పారిశ్రామిక పాలసీ మార్చి సబ్సిడీ 15 శాతం కు sc లకు కుదించారు.ఇంతకుముందు 45 శాతం వుండే దానిని ఈ విధం గా చేశారు.పోనీ టార్గెట్ లు కూడా పెంచలేదు.
5.సీతానగరం లో ఒక దళితుడికి పోలీస్ స్టేషన్ లొనే శిరోముండనం గావిస్తే ఇప్పటి వరకు దోషులను అరెస్ట్ చేయ లేదు.ఎవరి ఫోన్ కాల్ ద్వారా స్థానిక SI ప్రభావితమైనాడో ఆ కాల్ లిస్ట్ కూడా బయట పెట్టలేదు.
6.అదే శిరోముండనం విశాఖపట్నం లో జరిగితే పక్కాగా కేస్ పెట్టి సాక్షాలు, ఫోరెన్సిక్ నివేదిక అన్ని రెడీ చేశారు. సీతానగరం లో ఈ రకంగా ఎందుకు చేయలేదు?
7. చీరాల లో పోలీస్ లచే చంపబడ్డ కిరణ్ విషయంలో అన్యాయము చేశారు.ప్రభుత్వము ఇచ్చిన నివేదికపై మాకు నమ్మకము లేదు. CBI దర్యాప్తు అడిగాము.10 లక్షలు ఇచ్చి హై కోర్ట్ లోంచి కేస్ విత్ డ్రా చేయించారు కానీ న్యాయం చేయలేదు.ఈ కేస్ విషయం లో CBI దర్యాప్తు అడుగుతున్నాం.
అలాగే సీతానగరం శిరోముండనం మీద కూడా CBI అడుగుతున్నాం. CBI వేయించడానికి మీ అభ్యంతరం ఏమిటో మాకు అర్థం కావటం లేదు. అంతేర్వేది గుడి గురించి వేశారు కదా ఈ రెండు కేస్ ల ను CBI కి ఇవ్వండి.
8.సామూహికంగా అత్యాచారం చేసిన అమ్మాయి విషయంలో కూడా మీరు అన్యాయం చేసారు.ఆ కేస్ లో కూడా దిశ చట్టం పెట్టండి.
ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.ముందుగా కేస్ ల విషయము లో మీ అభిప్రాయము గురించి ఎదురు చూస్తాము. వ్రాత పూర్వకంగా మీ కార్యాలయానికి అర్జీ పంపుతాము. రేపు మీ కార్యాలయానికి ఈ ఉత్తరం వస్తుంది. మీరు జవాబు ఇవ్వరు అని తలుస్తూ ఒకవేళ ఇస్తే ఇక్కడ పబ్లిష్ చేస్తామని తెలుపుతూ,
భవదీయుడు.
జి.వి.హర్ష కుమార్, మాజీ ఎంపి